న్యూ ఇయర్ వేళ కిక్కే కిక్కు.. దేశ రాజధానిలో కోటి మందు బాటిళ్లు గుటక్ గుటక్..

|

Jan 03, 2023 | 11:57 AM

దేశ రాజధాని ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం పొంగి పొర్లింది. వారం రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. 1 కోటి బాటిళ్లు అమ్ముడైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. క్రిస్మస్...

న్యూ ఇయర్ వేళ కిక్కే కిక్కు.. దేశ రాజధానిలో కోటి మందు బాటిళ్లు గుటక్ గుటక్..
Liquor
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం పొంగి పొర్లింది. వారం రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. 1 కోటి బాటిళ్లు అమ్ముడైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు (డిసెంబర్ 24 నుండి 31 వరకు) వారం రోజుల్లో రూ.218 కోట్ల కంటే ఎక్కువ విలువైన మద్యాన్ని ఢిల్లీ వాసులు గుటుక్కుమనిపించారు. గత మూడేళ్లలో ఇదే రికార్డు స్థాయిలో కావడం గమనార్హం. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. డిసెంబరు 24 నుంచి 31 వరకు విస్కీతో కూడిన మొత్తం 1.10 కోట్ల మద్యం సీసాలు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 24 న నగరంలో మొత్తం ₹ 28.8 కోట్ల విలువైన 14.7 లక్షల సీసాలు విక్రయించినట్లు చెప్పారు. డిసెంబరు 27న రాజధానిలో కనీసం 19.3 కోట్ల విలువైన 11 లక్షలమద్యం సీసాలు అమ్ముడయ్యాయి.

డిసెంబర్ నెలలో దేశ రాజధానిలో సగటున 13.8 లక్షల మద్యం బాటిళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గత మూడేళ్లలో అత్యుత్తమ సంవత్సరాంత విక్రయం కావడం గమనార్హం. డిసెంబరులో మద్యం అమ్మకం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ₹ 560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎక్సైజ్ పాలసీ రద్దుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, కేంద్రం మధ్య భారీ రాజకీయ ప్రతిఘటనను తర్వాత అధిక మద్యం అమ్మకాలు జరిగాయి.

మరోవైపు.. తెలంగాణలోనూ నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. ఒక్కరోజే 254 కోట్లు విలువైన మద్యాన్ని గోదాముల నుంచి దుకాణదారులు తీసుకెళ్లారు. అర్థరాత్రి1 గంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. దీంతో విక్రయాలు మరింతగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.