Subhas Chandra Bose Birth Annivarsary: భారత దేశ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహా వీరుడు గొప్ప స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose) 125వ జయంతి నేడు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని ఈరోజు సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీ (newdelhi)లోని ఇండియా గేట్ (India Gate) వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. అంతేకాదు నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే వేడుకల్లో భాగంగా.. స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటానికి.. పరాక్రమానికి నివాళిగా గ్రానైట్‌తో తయారు చేసిన విగ్రహాన్ని కేంద్ర ఏఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. అయితే గ్రానైట్ విగ్రహానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు.. ఈరోజు సాయంత్రం ఆవిష్కరింపబడే ప్రదేశంలో నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఉంటుంది. ఈ హోలోగ్రామ్ విగ్రహం 30 వేల ల్యూమెన్స్ 4కె ప్రొజెక్టర్‌తో పనిచేస్తుంది. 90 శాతం పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేశారు. హోలోగ్రామ్ విగ్రహంసైజ్ 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. దీని ప్రభావం సృష్టించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3D చిత్రం దానిపై ప్రదర్శించబడుతుంది.
ఈ విగ్రహావిష్కరణ అనంతరం ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ 2019, 2020, 2021లతో పాటు 2022 సంవత్సరాలకు గాను సుభాస్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకలో మొత్తం ఏడు అవార్డులను ప్రధానం చేయనున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు , సంస్థలు అందించిన అమూల్యమైన సహకారాన్ని.. వారి నిస్వార్థ సేవలను గుర్తించి, గౌరవించేందుకు కేంద్రం వార్షిక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.
ఈ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన ప్రకటిస్తారు. ఒక సంస్థ కనుక ఈ అవార్డు 51 లక్షల రూపాయల నగదు బహుమతిని , ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. అదే ఈ అవార్డును ఒక వ్యక్తీ కనుక వ్యక్తిగతంగా ఆడుకుంటుంటే రూ. 5 లక్షలను ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. స్వాతంత్ర్య సమరయోధులను సముచిత రీతిలో సత్కరించడం తమ ఉద్దేశమని ప్రధాని మోడీ ప్రకటించారు. అంతేకాదు నేతాజీ జయంతిని ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటామని ప్రకటించడంతో పాటు ఈ విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. ఈ స్ఫూర్తితో ఈరోజు (జనవరి 23వ తేదీ) నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలు మూడు రోజులు ముందుగానే ప్రారభంకానున్నాయి.
Also Read: