Omicron: కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. కొన్ని దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తోంది. ఇక సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితాలో నుంచి సింగపూర్‌ను తొలగించింది. ఇక అదే సమయంలో ఆ జాబితాలో కొత్తగా టాంజానియా, ఘనా దేశాలను చేర్చింది.
సౌతాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు మరింతగా పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్ నిబంధనలు విధిస్తున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల జాబితాను అట్‌రిస్క్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అట్ రిస్క్ జాబితాలో ముందుగా సింగపూర్, ఇజ్రాయిన్, జింబాబ్వే, న్యూజిలాండ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూకే, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాలు ఉన్నాయి. ఇక ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ జాబితా నుంచి సింగపూర్ దేశాన్ని తొలగించింది. ఇక తాజా తాజా నిబంధనల ప్రకారం.. ఇక నుంచి సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: