Dogs: కుక్కలను పెంచుకోవాలనుకునే వారికి ఝలక్.. వారికి పన్ను విధించాలని నిర్ణయం.. సీన్ కట్ చేస్తే..

|

Jan 14, 2023 | 6:42 AM

శునకాలను ఇంట్లో పెంచుకోవడం అనేది ప్రస్తుతం చాలా కామన్. ప్రతి ఒక్కరూ తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రాకల కుక్కులను పెంచుకుంటున్నారు. అంతే కాకుండా వాటిని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు.

Dogs: కుక్కలను పెంచుకోవాలనుకునే వారికి ఝలక్.. వారికి పన్ను విధించాలని నిర్ణయం.. సీన్ కట్ చేస్తే..
Pet Dogs
Follow us on

శునకాలను ఇంట్లో పెంచుకోవడం అనేది ప్రస్తుతం చాలా కామన్. ప్రతి ఒక్కరూ తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రాకల కుక్కులను పెంచుకుంటున్నారు. అంతే కాకుండా వాటిని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు. శునకాలను పెంచుకోవడాన్ని కొందరు స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అయితే.. అలాంటి వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సాగర్‌ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించేందుకు సిద్ధమైంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సాగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో శునకాల ను పెంచుకునే యజమానులకు పన్ను విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. నగరంలో కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శునకాలకు రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు.

అయితే.. మున్సిపల్‌ కార్పొరేషన్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నగర వాసులు, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని, వీధి శునకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలే తప్ప.. పెంపుడు శునకాలపై పన్నులు విధించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..