Odisha Woman: అయినవారిని పోగొట్టుకుంది.. అవకాశవాద చుట్టాలను కాదని.. తనకు అండగా నిలబడ్డ రిక్షాకార్మికుడికి కోట్ల ఆస్తి ఇచ్చింది!

Odisha Woman: కట్టుకున్న భర్తని, కడుపున పుట్టిన కూతుర్ని పోగొట్టుకున్న వృద్ధురాలి ఆస్థి కోసం అయినవారు కన్నేశారు. దీంతో లేనిపోని ప్రేమను కురిపిస్తూ..

Odisha Woman: అయినవారిని పోగొట్టుకుంది.. అవకాశవాద చుట్టాలను కాదని.. తనకు అండగా నిలబడ్డ రిక్షాకార్మికుడికి కోట్ల ఆస్తి ఇచ్చింది!
Odisha Woman
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2021 | 4:09 PM

Odisha Woman: కట్టుకున్న భర్తని, కడుపున పుట్టిన కూతుర్ని పోగొట్టుకున్న వృద్ధురాలి ఆస్థి కోసం అయినవారు కన్నేశారు. దీంతో లేనిపోని ప్రేమను కురిపిస్తూ.. దగ్గరకు చేరడం మొదలు పెట్టువారు. తనవద్దకు తన వారు ఎందుకు వస్తున్నారో కనిపెట్టిన ఆ వృద్ధురాలు సంచలన నిర్ణయం తీసుకుంది. కోట్లు విలువజేసే తన ఆస్తిని తన ఫ్యామిలీతో 25 ఏళ్లుగా అనుబంధం ఉన్న ఓ రిక్షా కార్మికుడికి రాసి ఇచ్చేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ఒక వృద్ధురాలు తన దాతృత్వం, దానం చేసే స్వభావంతో అనేక తరాలకు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన 63 ఏళ్ల మినత్ పట్నాయక్ తన మొత్తం ఆస్తిని కటక్‌కు చెందిన రిక్షా పుల్లర్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని సుతాహత్ ప్రాంతంలోని ఆమెకు మూడంతస్తుల ఇల్లు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఆమె తన ఆస్తిని బుధ సామల్ అనే రిక్షా పుల్లర్‌కి ఇచ్చారు. మినత్ పట్నాయక్ ఇలా ఓ రిక్షా కార్మికుడికి రాసి ఇవ్వడానికి కారణం తెలిస్తే..  ఎవరి హుదాయాన్ని అయినా కదిలిస్తుంది.

మినత్ పట్నాయక్ భర్త 2020లో అనారోగ్యంతో మృతిచెందగా…2021 లో ఓ అగ్నిప్రమాదంలో కుమార్తె  మరణించింది. దీంతో వృద్ధురాలు ఒంటరిగా మారింది. మినత్ కు రిక్షా కార్మికుడు సామల్‌ ఫ్యామిలీ అండగా నిలిచింది.  అయితే అప్పటివరకు పట్టించుకోని అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెపై కపట ప్రేమను చూపించడానికి ప్రయత్నించారు. ఇది కనిపెట్టిన మినత్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయలకు పైగా విలువజేసే తన ఆస్తులను రిక్షా కార్మికుడు సామల్‌ కి రాసి ఇచ్చేసింది.

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..  రిక్షా కార్మికుడు బుధ  25 ఏళ్ల పాటు తన ఫ్యామిలీకి సేవలు చేస్తున్నాడని.. తన కుమార్తెను రిక్షాలో పాఠశాలకు తీసుకెళ్లేవాడని… తనకు అత్యవసరం ఉన్న సమయాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా తెచ్చేవాడని మినత్ పట్నాయక్ తెలిపింది. ఇప్పుడు కూడా ఏమీ ఆశించకుండా బుధ ఫ్యామిలీ తనకు సేవ చేస్తుందని చెప్పారు.  వారి కుటుంబం తనకు చేస్తున్న సేవలకు గాను తన ఆస్తిమొత్తాన్ని అధికారికంగా రాసి ఇచ్చానని.. ఎవరూ అతనిని వేధించకుండా అతనిపేరుతో రిజిస్ట్రేషన్ చేయించానని తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామగ్రిని రిక్షా కార్మికుడు బుధ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు.  తన కుటుంబానికి బుధ చేసిన సేవలకు ఏదో చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినత్ పట్నాయక్ పేర్కొంది.  ఇదే విషయంపై రిక్షా కార్మికుడు మాట్లాడుతూ.. తాను తన రిక్షాలో మరే ఇతర ప్రయాణీకులను ఎక్కించుకోలేదని .. ఇప్పటి వరకూ తాను మినత్ పట్నాయక్ , ఆమె కుటుంబానికి ఎప్పుడు సేవలను చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా మినత్ పట్నాయక్ కు కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పాడు.

Also Read:  కేరళకు రెడ్ అలెర్ట్… 48 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..