Odisha Train Accident: ఒడిశాలో మరో రైలుకు ప్రమాదం.. రాత్రి 10 గంటలకు దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

|

Jun 09, 2023 | 1:01 PM

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో కొందరిని గుర్తించినప్పటికీ.. 83 మందిని మాత్రం గుర్తించడం సాధ్యం కావడం లేదు. వారి మృతదేహాలు పూర్తిగా దెబ్బ తినడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికీ వాళ్ల మృత దేహాలు మార్చురీలోనే ఉండిపోయాయి.

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలుకు ప్రమాదం.. రాత్రి 10 గంటలకు దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
Durg Puri Express
Follow us on

ఒడిశాలో జరిగిన అత్యంత భయనక రైలు ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దుర్ఘటన మిగిల్చిన విషాదం ఇంకా దేశ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. అంతలోనే ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. నౌపడా జిల్లాలోని ఖరియార్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని బీ3 ఏసీ కోచ్‌లో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్రేక్‌ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని చెప్పారు. బ్రేక్‌ ప్యాడ్‌ మినహా రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. వాటిని ఆర్పివేశారని వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

రైలు ఖరియార్‌ రోడ్‌ స్టేషన్‌కు గురువారం రాత్రి 10.07 గంటలకు వచ్చిందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు చెప్పారు. అలారం చైన్‌ లాగిన తర్వాత రిలీజ్‌ కాలేదని, దీంతో బ్రేక్‌ ప్యాడ్లపై ఒత్తిడి పడి మంటలు తలెత్తాయని చెప్పారు. కోచ్‌ లోపల ఎలాంటి మంటలు రాలేదన్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రాత్రి 11 గంటలకు రైలు స్టేషన్‌ నుంచి బయల్దేరిందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో కొందరిని గుర్తించినప్పటికీ.. 83 మందిని మాత్రం గుర్తించడం సాధ్యం కావడం లేదు. వారి మృతదేహాలు పూర్తిగా దెబ్బ తినడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికీ వాళ్ల మృత దేహాలు మార్చురీలోనే ఉండిపోయాయి. ఈక్రమంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. మృతులను గుర్తించేందుకు రైల్వే అధికారులు తొలుత ఆధార్‌ నిపుణులను రప్పించి మృతదేహాల నుంచి వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడం, మృతదేహాలు కూడా అనుకూలంగా లేకపోవడంతో వేలి ముద్రలు తీసుకోవడం సాధ్యం కాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..