Odisha Train Accident: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత డిమాండ్

|

Jun 03, 2023 | 4:22 PM

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు.

Odisha Train Accident: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత డిమాండ్
Odisha Train Accident
Follow us on

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. రైలు ప్రమాద ఘటన జరిగితే దానికి నైతిక బాధ్యతవహిస్తూ అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అశ్వినీ వైష్ణవ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన రాజీనామాను ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలన్నారు.

రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపించి.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని చవాన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. విచారణ పేరిట కాలయాపన జరగకుండా..నిర్ణీత కాలవ్యవధిలోపు రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు కమిటీ తన నివేదికను సమర్పించేలా చూడాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 261 మంది దుర్మరణం చెందగా.. దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు. గత పదేళ్లలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాద ఘటన ఇదే. ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అక్కడ జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు. రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..