AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగుపాముతో పరిహాసమా..? పాముతో రీల్స్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు!

ఒడిశాలో నాగుపాముతో రీల్స్ చేస్తున్న యువకుడు దాని కాటుకు గురై మృతి చెందాడు. వైద్యుల సూచనలను విస్మరించి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడంతో అతడి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేయడం ప్రాణాంతకమని ఈ ఘటన హెచ్చరిస్తోంది. పాము కాటుకు గురైనప్పుడు సరైన చికిత్స తీసుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం చాలా ముఖ్యం.

నాగుపాముతో పరిహాసమా..? పాముతో రీల్స్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు!
Cobra Bite In Bhuvaneswar
Balaraju Goud
|

Updated on: Oct 10, 2026 | 6:17 PM

Share

భువనేశ్వర్‌: సోషల్‌ మీడియాలో లైకులు, వ్యూస్‌ కోసం కొందరు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా విషపూరిత పాములతో ఆటలాడుతూ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. నాగుపాముతో రీల్స్‌ చేస్తుండగా అది కాటు వేయడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

నాగుపాముతో వీడియో తీస్తుండగా ఘటన

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని పూరీ జిల్లా పరిధిలో ఉన్న కంఠపూర్‌ గ్రామానికి చెందిన తపన్‌ ప్రధాన్‌ (25) శుక్రవారం (అక్టోబర్ 09)నాగుపాముతో వీడియోలు తీస్తున్నాడు. రీల్స్‌ కోసం పామును ఆడిస్తుండగా అది ఒక్కసారిగా కాటు వేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే పూరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి ఇంజక్షన్‌ వేశారు.

వైద్యుల సూచన పట్టించుకోకపోవడంతో..!

చికిత్స అనంతరం కూడా యువకుడిని తమ పర్యవేక్షణలోనే ఉండాలని వైద్యులు సూచించారు. అయితే, వారి సూచనలను పట్టించుకోని తపన్‌ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శనివారం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. .

సోషల్‌ మీడియా వ్యామోహంతో ప్రాణాల మీదకు..

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేయడం ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నాగుపాము వంటి విషపూరిత పాములతో ఆటలాడటం అత్యంత ప్రమాదకరం. పాము కాటుకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి, వైద్యులు సూచించిన చికిత్సను పూర్తిగా తీసుకోవాలి. పరిస్థితి మెరుగుపడినట్లు అనిపించినా వైద్యుల అనుమతి లేకుండా ఆసుపత్రి నుంచి వెళ్లకూడదు. కొన్ని కాట్ల ప్రభావం తర్వాత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని రీల్స్‌ కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us