ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సహనం, ఉదారతను బలహీనతగా భావించొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని, గట్టిగా దెబ్బకొట్టగల సామర్థ్యం దేశానికి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డిస్కవరీ రూపొందించిన ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ డాక్యుమెంటరీ సిరీస్‌లో దోవల్ ఈ విషయాలను వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం శత్రు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమేనని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించారు. భారత్ తన సహనాన్ని ఎవరూ బలహీనతగా అర్థం చేసుకోకూడదన్న సందేశాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి స్పష్టంగా ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా..
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా మే 7న ఉదయం భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు నిర్వహించింది.
ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి దాడులు జరగడంతో భారత్ ప్రతీకార చర్యలను కొనసాగించింది. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దాదాపు 88 గంటల పాటు సాగిన ఈ సైనిక ఘర్షణ మే 10న ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో ముగిసింది.
డాక్యుమెంటరీలో కీలక విషయాలు
రెండు భాగాలుగా రూపొందించిన ‘డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్’లో భారత సైనిక, జాతీయ భద్రతా వ్యవస్థకు చెందిన కీలక వ్యక్తులు ఆపరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు, వ్యూహాలు, పరిణామాలపై మాట్లాడనున్నారు. సైనిక చర్య వెనుక ఉన్న నిర్ణయ ప్రక్రియ, జాతీయ భద్రతా నాయకత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అజిత్ దోవల్ ఇందులో వివరించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత దోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారత్ ఇకపై ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదన్న కఠిన వైఖరిని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..