‘హిందూ మతంతో వారికి ఎలాంటి సంబంధం లేదు.. వారు హిందువులకు చేసిందేమీ లేదు’ బీజేపీపై రాహుల్ ఫైర్‌

|

Sep 11, 2023 | 5:10 PM

హిందూయిజంతో బీజేపీకి ఒరిగేది ఏమీలేదని, అసలు హిందువులకు వారు చేసిందేమీలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌)పై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంతో బీజేపీకి ఎటువంటి..

హిందూ మతంతో వారికి ఎలాంటి సంబంధం లేదు.. వారు హిందువులకు చేసిందేమీ లేదు బీజేపీపై రాహుల్ ఫైర్‌
Rahul Gandhi At Paris Event
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: హిందూయిజంతో బీజేపీకి ఒరిగేది ఏమీలేదని, అసలు హిందువులకు వారు చేసిందేమీలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌)పై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. తాను గీత, ఉపనిషత్తులతోపాటు అనేక హిందూ మత గ్రంధాలు చదివానని.. ఎక్కడా (బీజేపీ) హిందువుల గురించి ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఆదివారం నాడు ఫ్రాన్స్‌లోని సైన్స్‌ పీఓ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

‘మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని లేదా హాని చేయాలని ఏ హిందూ పుస్తకంలో ఎక్కడా నేను చదవలేదు. అలాగే ఏ హిందూ పండితుడి నోటి వెంట నేను వినలేదు. హిందూ జాతీయవాది అనే పదం, ఆలోచన పూర్తిగా తప్పు. వారు ‘హిందూ జాతీయవాదులు’ కాదు. వారికి హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదని రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

‘హిందూ మతంతో బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతులను అణిచివేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. మా దేశంలోని కుల, సామాజిక నిర్మాణానికి ఎటువంటి ముప్పు రాకుండా చూసేందుకు తమ పార్టీ సిద్ధంగా’ ఉందన్నారు. అనంతరం రాడికలైజేషన్‌ గురించి రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీపై రాహుల్‌ మాటల దాడి ఇదేం తొలిసారి కాదు. 2021 లో బీజేపీని ‘నకిలీ హిందువులు’గా వ్యాఖ్యానించారు. తమ సొంత ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకుంటారంటూ గతంలో కూడా పలుమార్లు బీజేపీపై రాహుల్‌ మండిపడ్డారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ లోక్‌ సభ ఎంపీ తేజశ్వీ సూర్య తీవ్రంగా ఖండించారు. పుస్తకాలను చదవడం ద్వారా హిందూమతం ఆచరించబడుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నాడంటే మన ధర్మంపై ఆయనకు ఏమేరకు అవగాహన ఉందో తెలుస్తోంది. జీ20లో భారత్ ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించింది. గత దశాబ్ద కాలంలో ఆయనను ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు యూరప్‌లో నగరానికి దూరంగా అతికొద్ది మంది ప్రజల ముందు ఏడ్చే స్థితికి చేరుకున్నాడని ఎద్దేవా చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా సనాతన ధర్మంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల ప్రారంభంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘మలేరియా, డెంగ్యూ దోమల మాదిరి సనాతన (ధర్మం) నిర్మూలించబడాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో ఉదయనిథి తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటూ ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని ఓ ఆలయ పూజారి ప్రకటించారు కూడా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.