Dharmendra Pradhan: సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్‌ పార్టీది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు..

|

Nov 28, 2024 | 9:31 AM

ఏపీ, హర్యానా, మహారాష్ట్ర. ఎన్నికలు ఎక్కడ జరిగినా... ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోపణలు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది..

Dharmendra Pradhan: సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్‌ పార్టీది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు..
Dharmendra Pradhan - Mallikarjun Kharge
Follow us on

ఏపీ, హర్యానా, మహారాష్ట్ర. ఎన్నికలు ఎక్కడ జరిగినా… ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోపణలు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది.. ఇప్పటికే.. ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినా.. అందులో ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ నుంచి ఈ రకమైన ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రతిపక్షాలు ఈవీఎంలపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ఫలితాలను విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికి సంబంధించి ఇండియా బ్లాక్ నాయకులు పలు ప్రకటనలు చేశారు.. ఈవీఎంలను తొలగించి మళ్లీ బ్యాలెట్ పేపర్‌లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ట్యాగ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే.. కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు కోరుకుంటున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది స్వయంగా హాస్యాస్పదంగా ఉంది.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే నిరాశను చూపుతుంది. నిజానికి సమస్య ఈవీఎంలది కాదు కాంగ్రెస్ అవినీతి మనస్తత్వంది.. అంటూ ఫైర్ అయ్యారు.

బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నేడు కాంగ్రెస్ ఈవీఎంల వల్ల ఎన్నికల్లో ఓడిపోతుంటే.. వారి యువరాజు ఈవీఎంల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో గెలుపు, ఓటము అనే ప్రణాళిక లేదు కానీ ఫలితాలకు ముందే ఈవీఎంలపై నిందలు వేయాలనేది వారి ప్రణాళిక అన్నారు.. ప్రస్తుతం దీని నాయకత్వాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు కాంగ్రెస్‌ రాజకుటుంబం అప్పగించింది.. అంటూ ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సత్యాన్ని వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఎన్నికల సంఘం, ఈవీఎంలు వారి టార్గెట్ గా నిలుస్తాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్ పేర్కొంటుందని.. కానీ.. అదే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఇది ఆదేశాన్ని అవమానించడమేనని.. కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నారనేది వాస్తవమంటూ పేర్కొన్నారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సత్యాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదంటూ హితవు పలికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..