ఈశాన్యం ఎవరిదో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో..కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటుచేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో 60 సీట్ల చొప్పున మొత్తం 180 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే నాగాలాండ్, మేఘాలయలో ఒక్కో సీటు ఏకగ్రీవమవడంతో రెండు చోట్లా 59 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది మరికాసేపట్లోనే తేలిపోనుంది.
అయితే త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ కూటమిదే అధికారమని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. మేఘాలయలో 85.25 శాతం పోలింగ్ నమోదు అవగా.. అధికార ఎన్‌పిపి, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నాయి. అయితే మేఘాలయలో హంగ్ అసెంబ్లీ గ్యారంటీ అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. మేఘాలయలో ఎన్‌పిపి అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది. ఈసారి నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..