బిహార్ లోని సరాన్ జిల్లా మెజిస్ట్రేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగోలు జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్ వేసుకొని కార్యాలయాలకు రాకుండా నిషేధం విధించింది. ఆఫీస్ కు ఫార్మల్ దూస్తులు మాత్రమే వేసుకొని రావాలని ఆదేశించింది. అలాగే ఉద్యోగులందరూ మెడలో ఐడీ కార్డులు కూడా వేసుకోవాలని సూచించింది. ఉదయం 10:00 AM నుంచి సాయంత్రం 4:00 PM వరకు ఉన్న పని సమయాల్లో ఆఫీస్ లోనే ఉండాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని విధానాన్ని మార్చేందుకే ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపింది.
ఒక్కోసారి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి అకస్మాత్తుగా వచ్చి పరిశీలిస్తామని. అలాగే వీడియో కాన్ఫరెస్స్ లేదా వీడియో కాల్ కూడా చేసి ఆఫీస్ పరిస్థితిని గమనిస్తామని పేర్కొంది. ఉద్యోగలందరూ ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేకపోతే వారిపై జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది.
అయితే ఇలాంటి నిబంధనలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా బిహార్ ప్రభుత్వం సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు సాధరణ దూస్తులు వేసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లోకి జీన్స్, టీ షర్ట్స్ ధరించి రావడంపై నిషేధం విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..