కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ‘ఐసిస్’నీడ’ ! ఐరాస రిపోర్టు తప్పు, కేంద్రం
కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న ఐరాస నివేదిక సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ రిపోర్టును తిరస్కరించింది. ఇది తప్పుడు నివేదిక అని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభకు తెలిపారు.

కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న ఐరాస నివేదిక సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ రిపోర్టును తిరస్కరించింది. ఇది తప్పుడు నివేదిక అని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభకు తెలిపారు. ఈ రిపోర్టు సంగతి అయితే ప్రభుత్వానికి తెలుసు.. కానీ ఈ టెర్రరిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న విషయం మాత్రం అబధ్ధం అని ఆయన పేర్కొన్నారు. (కేరళలోని ఎర్నాకుళంలో ఇటీవలే ఆల్ ఖైదాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అరెస్టు చేసింది). ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఇండియా ‘పొజిషన్’ ని అంతర్జాతీయ వేదికలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా ఎన్ఐఏ.. ఆల్-ఖైదా, లష్కరే తదితర టెర్రరిస్టు బృందాలకు చెందిన 240 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిందని ఆయన చెప్పారు.



