Electricity Bill: ప్రతి ఇంటికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఆ రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం

|

Jun 01, 2023 | 9:30 AM

ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1 నుంచి ప్రతి ఇంటికి 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. రాజస్థాన్‌లో ప్రతినెలా 100 యూనిట్ల విద్యుత్తు వినియోగించే..

Electricity Bill: ప్రతి ఇంటికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఆ రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం
Electricity Bill
Follow us on

ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1 నుంచి ప్రతి ఇంటికి 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. రాజస్థాన్‌లో ప్రతినెలా 100 యూనిట్ల విద్యుత్తు వినియోగించే వారి బిల్లు పూర్తిగా జీరో అవుతుంది. 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే కుటుంబాలు 100 యూనిట్ల రాయితీని కూడా పొందుతాయి. అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించినా 100 యూనిట్ల బిల్లు ఉచితంగానే ఉంటుందని సీఎం తెలిపారు.

రాజస్థాన్‌లో విద్యుత్ బిల్లుల్లో శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని ఉన్నతాధికారులకు సూచించినట్లు గెహ్లాట్ తెలిపారు. దీని తరువాత, గెహ్లాట్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును బహుమతిగా ఇచ్చింది.

200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు కూడా ఎక్కువ రాయితీ ఇవ్వబడుతుంది. ఇందులో మొదటి 100 యూనిట్లు ఉచితం, కానీ అంతకు మించి వినియోగంపై, ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఇంధన సర్‌ఛార్జ్‌లు సహా అన్ని ఇతర ఛార్జీలు ప్రభుత్వం మినహాయించనుంది. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిందని ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి