AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవీషీల్డ్ మార్కెటింగ్ కోసం సీరం సంస్థ నుంచి దరఖాస్తు అందలేదన్న యూరోపియన్ యూనియన్ మెడిసిన్ ఏజెన్సీ

కోవీషీల్డ్ వ్యాక్సిన్ మార్కెటింగ్ కోసం తమకు ఇండియాలోని సీరం సంస్థ నుంచి దరఖాస్తు అందలేదని యూరోపియన్ యూనియన్ మెడిసిన్ ఏజెన్సీ తెలిపింది.

కోవీషీల్డ్  మార్కెటింగ్ కోసం సీరం సంస్థ నుంచి దరఖాస్తు అందలేదన్న యూరోపియన్ యూనియన్ మెడిసిన్ ఏజెన్సీ
Covishield
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 17, 2021 | 1:11 PM

Share

కోవీషీల్డ్ వ్యాక్సిన్ మార్కెటింగ్ కోసం తమకు ఇండియాలోని సీరం సంస్థ నుంచి దరఖాస్తు అందలేదని యూరోపియన్ యూనియన్ మెడిసిన్ ఏజెన్సీ తెలిపింది. ఏ వ్యాక్సిన్ కన్నా ట్రావెల్ పాస్ పోర్టు కావాలంటే ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ చాలా అవసరం. ఈ పద్దతిని 15 రోజుల క్రితమే ఈ సంస్థ ప్రవేశపెట్టింది. ఇక్కడ ఈ వ్యాక్సిన్ ని ఇవాల్యుయేట్ చేయాలంటే (ఆమోదించాలంటే) మాకు డెవలపర్ లాంఛనంగా మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది. కానీ సీరం కంపెనీ ఇప్పటివరకు అలాంటి దరఖాస్తు అందజేయలేదు అని ఈ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఆథరైజేషన్ లో భాగంగా ఈ విధమైన అప్లికేషన్ అవసరమని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఈ పాండమిక్ లో ఆంక్షలు లేని టీకామందులు నాలుగు మాత్రమే. అవి..ఫైజర్, బయో ఎన్ టెక్, మోడెర్నా వారి స్పైక్ వాక్స్, ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వారి వాక్స్ జెర్వియా . జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారి జన్ సీన్ వ్యాక్సిన్లు..

అయితే పలు యూరప్ దేశాలు వేటికవే స్వయంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను ఆమోదించడంతో ఈయూ ఉత్తర్వుల ప్రభావం తగ్గింది. ఇటీవల బ్రిటన్ లో ఓ వృద్ధ జంట మాల్టా వెళ్లేందుకు ,మాంచెస్టర్ విమానాశ్రయానికి చేరుకోగా..వీరు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా అనుమతించబోమంటూ అధికారులు వారిని తిప్పి పంపివేశారు. యూకే లో ఈ టీకామందుకు అనుమతి లేదా అని ఆ జంట వాపోయింది. అయితే లక్షలాది మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా.. సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ఇదేమంత పెద్ద సమస్య కాదని, తాము ఈయూకి దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Minister Harish Rao: మంత్రి హరీష్ రావు రాకతో.. ఆ ఇంట, ఆ ఊరంతా ఆనందం విరిసింది…

BP Diabetes: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? అదుపులో ఉంచుకోవాలంటే ఇవి పాటించాలంటున్న వైద్య నిపుణులు

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ