Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: మంత్రి హరీష్ రావు రాకతో.. ఆ ఇంట, ఆ ఊరంతా ఆనందం విరిసింది…

వరంగల్‌, నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం కొండైలు పల్లి గ్రామానికి చెందిన తడబోయిన విజయ్ అనే వ్యక్తి టీఆర్‌ఆర్ పార్టీలో...

Minister Harish Rao: మంత్రి హరీష్ రావు రాకతో.. ఆ ఇంట, ఆ ఊరంతా ఆనందం విరిసింది...
Minister Harish Rao
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 17, 2021 | 12:58 PM

వరంగల్‌, నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం కొండైలు పల్లి గ్రామానికి చెందిన తడబోయిన విజయ్ అనే వ్యక్తి టీఆర్‌ఆర్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. అతడకి సీఎం కేసీఆర్ అన్నా, మంత్రి హరీష్ రావు అన్నా వల్లమాలిన అభిమానం. మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో తండ్రి తో కలిసి అనేక ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆనాటి సమైక్య పాలకులకు చాటి చెప్పాడు విజయ్.  అప్పటి ఉద్యమ నాయకులు శ్రీ కేసిఆర్, తన్నీరు హరీష్ రావులు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ… యువతలో భావజాల వ్యాప్తికి కృషి చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తడబోయిన విజయ్ సామాజిక మాధ్యమాలలో యాక్టివ్‌గా ఉంటూ తెలంగాణ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. పలు ప్రముఖ తెలుగు దినపత్రికల లో తెలంగాణలో ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం చేపడుతున్న పథకాల పై ప్రజలను చైతన్యం చేస్తూ వందలాది వ్యాసాలు రాశాడు… రాస్తూనే ఉన్నాడు.

తన వీరాభిమాని గానే కాకుండా… ప్రభుత్వ కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ చేస్తున్న కృషి మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావును ఆకర్షించింది. శుక్రవారం సాయంత్రం నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ నల్లబెల్లి సమీపంలో ఉన్న గ్రామంలోని తన ఇంటికి రావాల్సిందిగా మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఆహ్వానించారు. అభిమాని విజయ్ కోరిక మేరకు .. మంత్రి అతని ఇంటికి వెళ్లారు.  విజయ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న పంటలపై విజయ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల నుంచి వివరాలు సేకరించారు. విజయ్ కుటుంబ సభ్యులతో మంత్రి గ్రూప్ ఫోటో దిగారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువెత్తింది. మంత్రి తొలిసారి తమ గ్రామానికి రావడంతో గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: ఆ దేశ అధ్యక్ష భవనం రక్షణ బాధ్యతను గద్దలు, గుడ్ల గూబలు చూసుకుంటాయి

 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహం వేట ఇంత దారుణంగా ఉంటుందా..?