AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలకు విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వారికి […]

తిరుమలకు విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌
Anil kumar poka
|

Updated on: Dec 19, 2019 | 12:07 PM

Share
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వారికి స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక అవసరాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఆర్థిక సంఘం ఏపికి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కే.సింగ్ కు ఆర్థిక అవసరాలకు సంబంధించి వినతి పత్రాలను అందజేస్తారని తెలిపారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, దాని దృష్టిలో పెట్టుకొనే మూడు రాజధానులు అనే మనస్సులోని ఆలోచనను సీఎం చెప్పారని అన్నారు. ఇక ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగా 5వేల కోట్లు బకాయి బిల్లులు ఉంటాయి, కానీ గత టీడీపీ ప్రభుత్వం 60 వేల కోట్లు బకాయిలు వదిలి వెళ్లారు. వాటిని పూర్తిచేయడానికి ఆలస్యమైందే తప్ప…ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని టీడీపీ చేస్తున్న ఆరోపణ దుర్మార్గమని బుగ్గన అన్నారు.