భూకంపం: విజయవాడ సహా 14 నగరాలకు హైరిస్క్!

విజయవాడ సహా 14 నగరాలకు హైరిస్క్ పొంచి ఉందా..? ఈ రిస్క్ టెర్రరిస్టుల పరంగా కాదు.. భూకంప ముప్పుగా! నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇప్పుడు ఈ వార్తతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో భూకంపం ముప్పు పొంచివున్న నగరాల్లో విజయవాడ మొదటగా చెప్పుకోవాలి. ఈ నగర భౌగోళిక పరిస్థితులు, జనావాసాలు, కొండ ప్రాంతాలను బట్టి ఈ నిర్థారణకు వచ్చామని హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. దేశంలో […]

భూకంపం: విజయవాడ సహా 14 నగరాలకు హైరిస్క్!
Follow us

| Edited By:

Updated on: Dec 19, 2019 | 12:26 PM

విజయవాడ సహా 14 నగరాలకు హైరిస్క్ పొంచి ఉందా..? ఈ రిస్క్ టెర్రరిస్టుల పరంగా కాదు.. భూకంప ముప్పుగా! నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇప్పుడు ఈ వార్తతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఏపీలో భూకంపం ముప్పు పొంచివున్న నగరాల్లో విజయవాడ మొదటగా చెప్పుకోవాలి. ఈ నగర భౌగోళిక పరిస్థితులు, జనావాసాలు, కొండ ప్రాంతాలను బట్టి ఈ నిర్థారణకు వచ్చామని హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. దేశంలో చెన్నై, విజయవాడ సహా మొత్తం 50 నగరాలకు ముంప్పు పొంచి ఉండగా, ఇందులో 14 నగరాలు హైరిస్క్‌ని ఫేస్ చేయబోతున్నాయని.. మరో 15 నగరాలు మీడియం రిస్క్ జోన్‌లో ఉన్నాయని వారు తమ స్టడీ పేపర్‌లో తెలిపారు.

దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు అనధికారికంగా జరిగిన నిర్మాణాలకు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని వారు తేల్చారు. సాధారణంగా.. సముద్ర దగ్గరి ప్రాంతాల్లో భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని భూ ఫలకాల్లో కదలిక ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా.. ఏఏ నగరాలకు భూకంప ప్రమాదం పొంచి ఉందన్న అధ్యయనం చేయడానికి.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ రంగంలోకి దిగింది.

సముద్ర తీర ప్రాంతాల్లో ఎంతమంది జనం నివసిస్తున్నారు? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది అనేవాటిపై నిపుణులు పరిశోధనలు చేపట్టారు. అలాగే.. ఇసుక నిర్మాణాలు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి? ఇక్కడ భూకంపం వచ్చిన సూచనలు ఏమైనా ఉన్నాయా..? గతంలో వచ్చాయా అని పరిశోధనలు చేయగా.. దేశంలోని 14 నగరాలకు భూకంప ముప్పు పొంది ఉందని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పరిశోధకులు కనుగొన్నారు.

ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబాయి, అహ్మదాబాద్, డార్జిలింగ్, ఛత్తీస్‌ఘడ్, రత్నగిరి, అజ్వాల్, శ్రీనగర్, షిమ్లా, పానిపట్, పితోరగర్హ్, ఉత్తరాక్షి, మొరాదాబాద్, భగల్ పూర్, గ్యాంగ్ టక్ వంటి ప్రాంతాల్లో అధికంగా భూకంపాలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ప్రజలు జాగ్రత్త పడాలని వారు సూచించారు. ఎప్పుడు ఎలా చిన్న భూ కదలిక అనిపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు.

Latest Articles