Highway Projects Approved: ఏపీ, యూపీ రాష్ట్రాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘కరుణ’, 5 హైవే ప్రాజెక్టులకు ఆమోదం
కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ, యూపీ రాష్ట్రాలకు సంబంధించి 5 హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఏపీలో..
Highway Projects Approved: కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ, యూపీ రాష్ట్రాలకు సంబంధించి 5 హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఏపీలో కంటకపల్లె-సబ్బవరం జాతీయ రహదారిపై రూ. 824.29 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ప్రాజెక్టుకు, అలాగే కొర్లామ్-కంటకపల్లె సెక్షన్ లో రూ. 772.70 కోట్లు వ్యయమయ్యే ఆరు లేన్ల అభివృద్ధి పనులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతపురం టౌన్ లో నేషనల్ హైవేపై 4 లేన్ల రోడ్డు వెడల్పునకు సంబంధించి 311.93 కోట్ల ప్రాజెక్టుకు కూడా గడ్కరీ ఓకె చెప్పారు. యూపీలో రాయ్ బరేలీ-జగదీష్ పూర్ సెక్షన్ లో 2/4 లేన్ల పనులకు 720. 812 కోట్ల వ్యయమయ్యే ప్రాజెక్టుకు, ముజఫర్ నగర్-మిరాన్ పూర్ సెక్షన్ లో 928.55 కోట్ల ప్రాజెక్టుకు సైతం గడ్కరీ ఆమోదముద్ర వేశారు. బిజ్నూర్-కొత్వాల్ సెక్షన్ లో 300.59 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన ఓకే చెప్పారు.
Also Read: