Nithari Murder Case: నిఠారీ సీరియల్‌ మర్డర్‌ కేసుల్లో అల్హాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు!

|

Oct 16, 2023 | 3:42 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ మర్డర్‌ కేసులో ఉరి శిక్ష పడిన ఇద్దరు నిందితులకు అల్హాబాద్‌ హైకోర్టు సోమవారం (అక్టోబర్ 16) నిర్దోశుషులుగా ప్రకటించింది. నిందితుడు సురీందర్‌ కోలీపై ఉన్న 12 కేసుల్లో కోర్టు నిర్దోషిగా తేల్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో అతనికి విధించిన ఉరిశిక్ష కూడా కోర్టు రద్దు చేసింది. అలాగే మోనీందర్‌ సింగ్‌ పంధేర్‌పై ఉన్న 2 కేసులను అలహాబాద్‌ హైకోర్టు రద్దు చేసింది. తగిన సాక్ష్యాధారాలతో ప్రాసిక్యూషన్‌ నిరూపించడంలో విఫలం..

Nithari Murder Case: నిఠారీ సీరియల్‌ మర్డర్‌ కేసుల్లో అల్హాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు!
Nithari Murder Case
Follow us on

అలహాబాద్‌, అక్టోబర్ 16: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ మర్డర్‌ కేసులో ఉరి శిక్ష పడిన ఇద్దరు నిందితులకు అల్హాబాద్‌ హైకోర్టు సోమవారం (అక్టోబర్ 16) నిర్దోశుషులుగా ప్రకటించింది. నిందితుడు సురీందర్‌ కోలీపై ఉన్న 12 కేసుల్లో కోర్టు నిర్దోషిగా తేల్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో అతనికి విధించిన ఉరిశిక్ష కూడా కోర్టు రద్దు చేసింది. అలాగే మోనీందర్‌ సింగ్‌ పంధేర్‌పై ఉన్న 2 కేసులను అలహాబాద్‌ హైకోర్టు రద్దు చేసింది. తగిన సాక్ష్యాధారాలతో ప్రాసిక్యూషన్‌ నిరూపించడంలో విఫలం కావడంతో పంధేర్‌, కోలీలకు విధించిన మరణ శిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీళ్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ మేరకు నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.

వీరిపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేనందువల్ల త్వరలో వీరు జైలు నుంచి విడుదలకానున్నారు. తాజా తీర్పుకు సంబంధించిన వివరణాత్మక తీర్పు తర్వాత అందుబాటులోకి వస్తుందని పంధేర్‌ తరపు న్యాయవాది మనీషా భండారీ మీడియాకు తెలిపారు. కాగా 2006లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని నిథారీలోనున్న మొనీందర్ సింగ్ పంధేర్ నివాసంలో అనేక మానవ అవశేషాలు వెలుగు చూశాయి. నిథారీ ప్రాంతంలోని పంధేర్‌ ఇంటి లోపల ఉన్న పెరట్లోని కాలువలో 8 మంది పిల్లల అస్థిపంజరాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను మభ్యపెట్టి ఇంట్లోకి రప్పించి వారిని అత్యాచారం చేసి, హత్య చేశారనేది ప్రధాన ఆరోపణలు.

ఇవి కూడా చదవండి

ఆ ప్రాంతంలో తప్పిపోయిన పిల్లలు, యువకులను అపహరించి సాక్షాధారాలు దొరక్కుండా నరికి కాలువలో పడేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ నేరాల కింద పంధేర్‌, కోలీపై కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరిపై నరమాంస భక్షకులుగా ఆరోపణలు వచ్చాయి. కోలీపై మొత్తం 16 కేసులు నమోదు కాగా వాటిల్లో 12 కేసుల్లో ట్రయల్ కోర్టులు మరణ శిక్ష విధించాయి. పంధేర్‌కు కూడా ట్రయల్ కోర్టులు 2 కేసుల్లో మరణశిక్ష విధించాయి. వీరికి విధించిన మరణ శిక్షను సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు అప్పీల్‌ చేసుకోగా.. వారిని నిర్దోషులుగా ఈ రోజు కోర్టు ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.