Black Fungus: దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు.. సగం మంది డయాబెటిస్‌ ఉన్నవారే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

|

May 24, 2021 | 3:29 PM

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే .. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి..

Black Fungus: దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు.. సగం మంది డయాబెటిస్‌ ఉన్నవారే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Black Fungus
Follow us on

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే .. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంత వరకూ 5,424 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కోవిడ్‌పై మంత్రులతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్లాంగ్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగం మందికి డయాబెటిస్ కూడా ఉందని చెప్పారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకూ 5,424 మందికి బ్లాగ్ ఫంకస్ వచ్చిందన్నారు. వీరిలో 4,556 మందికి కోవిడ్ చరిత్ర ఉందని, 55 శాతం మంది రోగులకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు.

కోవిడ్ చికిత్సలో హెచ్చు మోతాదులో స్టెరాయిడ్స్ వాడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా బ్లాగ్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం-1987 కింద నోటిఫయబుల్ వ్యాధిగా పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిస్, మేనేజిమెంట్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అమలు చేస్తున్నాయి. కోవిడ్ పేషెంట్లలో, ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాగ్ ఫంగస్‌ను గుర్తుస్తున్నారు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి.

కాగా, ఈ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఒకవైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చి మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వ్యాధులు ముంచుకొస్తాయోనని జనాలు వణికిపోతున్నారు. గత ఏడాదిగా విజృంభిస్తున్న మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీనికి తోడు బ్లాక్‌ ఫంగస్‌ కూడా తోడు కావడంతో జనాలు గజగజ వణికిపోతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Corona: ఒక్కరికి కరోనా వస్తే.. 27 మందికి వచ్చినట్టే.! ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్‌ నిజాలు..

Covaxin: భారత్ బయోటెక్ మరో ముందడుగు.. జూన్‌లో పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..