షాకింగ్ న్యూస్.. శానిటైజర్లలో 50 శాతం కల్తీవట
కరోనా వేళ వైరస్ సోకకుండా ఉండేందుకు తరచుగా చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Adulterated Sanitizers News: కరోనా వేళ వైరస్ సోకకుండా ఉండేందుకు తరచుగా చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శానిటైజర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే కొంతమంది శానిటైజర్ల వ్యాపారం పేరిట అక్రమ దందా చేస్తున్నారు. నకిలీ శానిటైజర్లను తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 50శాతం శానిటైజర్లు కల్తీవని కన్జూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీజీఎస్‌ఐ) వెల్లడించింది. మొత్తం 120 శానిటైజర్ శాంపిళ్లపై తాము ప్రయోగాలు చేయగా.. అందులో 50శాతం కల్తీవని తేలింది. అంతేకాదు 4 శాతం శానిటైజర్లలో హానికారక మిథైల్ ఆల్కాహాల్ కలిసి ఉందని.. కొన్నింటిలో ఆల్కాహాలు లేదని, మరికొన్నింటిలో శానిటైజర్లపై తయారీ వివరాలు లేవని పేర్కొంది.
ఈ మేరకు తమ నివేదికను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆహార ఔషధ నియంత్రణ మండలి (ఎఫ్‌డీఏ)కి పంపామని సీజీఎస్‌ఐ వెల్లడించింది. కరోనా వేళ చేతులు శుభ్రం చేసుకోవడం కోసం శానిటైజర్ వాడకం తప్పనిసరి కావడంతో ఈ వ్యాపారంలో డబ్బులు సంపాదించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సీజీఎస్ కార్యదర్శి డాక్టర్ ఎంఎస్ కామత్ పేర్కొన్నారు. సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు.. 60 శాతం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌ను వాడాలని ఆయన సూచించారు. ఇక ఇథైల్ ఆల్కాహాల్ కాకుండా మిథైల్ ఆల్కహాల్‌ను వాడటం వలన సమస్యలు తలెత్తుతాయని.. దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇక మార్కెట్‌లో లభించే 37 శాతం శానిటైజర్లపై తయారీ వివరాలు తెలిపే లేబుల్ లేదని కామన్ వెల్లడించారు.
Read More:
బీజేపీలో చేరేందుకు వెళ్లిన రౌడీ షీటర్.. పోలీసులను చూసి పరార్