టెలీకామ్ సంస్థలకు ఊరట ఇచ్చిన సుప్రీంకోర్టు
టెలీకామ్ సంస్థలకు సుప్రీంకోర్టు గొప్ప ఊరటనిచ్చింది. స్థూల రాబడి సర్దుబాటు(ఎజీఆర్) బకాయిలను చెల్లించేందుకు టెలీకామ్ కంపెనీ 10 ఏళ్ల గడువును ఇచ్చింది. అంటే 2031 వరకు ఈ బకాయిలను వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చంటూ- జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

టెలీకామ్ సంస్థలకు సుప్రీంకోర్టు గొప్ప ఊరటనిచ్చింది. స్థూల రాబడి సర్దుబాటు(ఎజీఆర్) బకాయిలను చెల్లించేందుకు టెలీకామ్ కంపెనీ 10 ఏళ్ల గడువును ఇచ్చింది. అంటే 2031 వరకు ఈ బకాయిలను వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చంటూ- జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. టెలీకామ్ కంపెనీలు కేంద్రానికి ఎజీఆర్ బకాయిల కింద లక్షన్నర కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టెలీకామ్ కంపెనీలు తమ బకాయిల్లో 10 శాతానికి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా తొలి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు గడువు 2021 మార్చి 31గా ఖరారు చేసింది. బకాయిలు చెల్లించడానికి సంబంధించి కంపెనీ మేనేజింగ్ డైరక్టర్లు గానీ, సీఈవోలుగానీ నాలుగు వారాల్లోగా పర్సనల్ గ్యారంటీ ఇవ్వాలంటూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ఎజీఆర్ బకాయిల పేమెంట్స్ విషయంలో కంపెనీలు డీఫాల్ట్ అయితే కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణిస్తామనీ, జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీల కింద ఎజీఆర్ కింద కంపెనీలు మూడు నుంచి 5 శాతం మొత్తాన్ని, లైసెన్స్ ఫీజు కింద ఎనిమిది శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. వోడాఫోన్ ఐడియా ఎజీఆర్ బకాయిల కింద 50వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 7854 కోట్ల డిపాజిట్ చేసింది. భారతీ ఎయిర్‌టెల్ 18వేల కోట్లు చెల్లించింది. ఈ కంపెనీ ఇంకా 25,796 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ బాకీలు చెల్లించడానికి 15 ఏళ్లు సమయం కావాలని ఈ రెండు కంపెనీలు కోర్టును కోరాయి. మరోవైపు ప్రభుత్వం కూడా సర్వీస్ ప్రొవైడర్లకు 20 ఏళ్లు సమయం ఇవ్వాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం 10 ఏళ్ల సమయమే ఇచ్చింది.