‘వాళ్లకు ఉద్యోగాలివ్వండి, పసలేని నినాదాలు కాదు’, రాహుల్ గాంధీ

నీట్, జేఈఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించాలని, అంతే తప్ప ఎలాంటి ఉపయోగం లేని నినాదాలు ఇవ్వరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి సూచించారు...

'వాళ్లకు ఉద్యోగాలివ్వండి, పసలేని నినాదాలు కాదు', రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 01, 2020 | 5:39 PM

నీట్, జేఈఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించాలని, అంతే తప్ప ఎలాంటి ఉపయోగం లేని నినాదాలు ఇవ్వరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి సూచించారు. జేఈఈ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని రాహుల్ అన్నారు. మీరు ఈ దేశ భవిష్యత్తును దెబ్బ తీస్తున్నారు, ఈ అభ్యర్థుల ‘జెన్యూన్’ సమస్యలపట్ల దృష్టి  పెట్టండి, వారికి ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వండి.. వీళ్ళే కాదు..ఎస్సెస్సీ పరీక్షలు రాసిన వారిమీద కూడా మీరు ఫోకస్ పెడితే మంచిది అని ఆయన ట్వీట్ చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా వీరి ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కోరిన విషయం విదితమే. అయితే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని భావించిన కేంద్రం,, కరోనా వైరస్ గైడ్ లైన్స్ ప్రోటోకాల్ ని  అనుసరించి వీటి నిర్వహణపట్లే మొగ్గు చూపింది.