ఫలించిన ప్రార్థనలు.. బోరు బావి చిన్నారి కథ సుఖాంతం.. చివరకు సురక్షితంగా బయటకు..

| Edited By: Janardhan Veluru

Feb 26, 2022 | 11:32 AM

పూడ్చకుండా వదిలేసిన బోరు గుంతల్లో(Bore Well) పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోతే వారు పడే వేదన ఊహకు...

ఫలించిన ప్రార్థనలు.. బోరు బావి చిన్నారి కథ సుఖాంతం.. చివరకు సురక్షితంగా బయటకు..
Bore Well
Follow us on

పూడ్చకుండా వదిలేసిన బోరు గుంతల్లో(Bore Well) పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోతే వారు పడే వేదన ఊహకు అందనిది. పొలంలో సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి.. బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు 24 గంటల పాటు శ్రమించి, బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. రాజస్థాన్(Rajasthan) ​లోని శిఖర్​జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన నాలుగున్నరేళ్ల వయసున్న బాలుడిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. 24 గంటలకు పైగా ఎస్​డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు శ్రమించి, బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతరంగా ఓ సొరంగం తవ్వి బాలుడిని రక్షించామన్నారు. ఈ ఆపరేషన్​లో అందరూ తీవ్రంగా శ్రమించడంతో తాము సఫలం​అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ ఘటన..

శిఖర్​జిల్లాలో పూడ్చకుండా వదిలేసిన బోరు బావిలో ప్రమాదవశాత్తు బాలుడు పడిపోయాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడి ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లవాడిని వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బాలుడు జారి పడిపోయిన బోరుబావి లోతు 50 అడుగులు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Also Read

ఆకాశం నుంచి కుప్పలు తెప్పలుగా పడ్డ పక్షులు !! ఇంతకీ వేటాడిండెవరు ?? వీడియో

Bheemla Nayak Collections: అడవి బిడ్డ భీమ్లా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు.. ఏంది సామి ఈ ఊచకోత

ఐఎమ్ఎఫ్ నుంచి రుణాలు.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. గరిష్ఠస్థాయికి చేరిన ధరలు