NCW New Helpline: మహిళలు ఇది మీ కోసమే.. ఎలాంటి ఆపద వచ్చినా ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. ఎనీ టైమ్…
దేశంలో రోజురోజుకూ మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలా కామాందులు వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చెక్ పెట్టి.. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ మహిళా కమిషన్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్-14490ను ప్రారంభించింది.

సమాజంలో రోజురోజుకూ మహిళలపై జరుగుతున్న వేధింపులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందు కామాందులు తమ వక్రబుద్దికి పినిచెబుతున్నారు. ఇవే కాదు.. మహిళలకు ఇళ్లలో కూడా రక్షణ లేకుండా పోతుంది. కొన్ని సందర్భాల్లో కట్టుకున్న భర్తలే వారి పాలిట యముళ్లలా మారుతున్నారు. ఇలాంటి చర్యలన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ మహిళా కమిషన్ మహిళల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు 24 గంటలు అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్-14490ను ప్రారంభించింది.
హింసించడం, వేధించడం, ఇంబ్బందులకు గురి చేయడం ఇలా మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే.. 14490 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ, యువతులు ఈ నంబర్‌ను సంప్రదించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొంది. కాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే.. మీరు ఎక్కడున్నా.. ఎలాంటి ఆపదలో ఉన్న హెల్ప్‌లైన్ సిబ్బంది సహాయం చేస్తారని తెలిపింది.
ఈ మహిళా హెల్ప్‌లైన్ (14490) న్యూఢిల్లీలోని కార్యాలయం నుండి 24×7 పనిచేస్తుంది. ఇది బాధిత మహిళలకు డిజిటల్ ఫిర్యాదు నమోదు వ్యవస్థగా పనిచేస్తూ, వారిని సంబంధిత అధికారులతో తక్షణమే అనుసంధానిస్తుంది. ఈ అధికారులలో పోలీసులు, ఆసుపత్రులు, జిల్లా న్యాయ సేవల అధికారులు, రక్షణ అధికారులు వన్-స్టాప్ సెంటర్లు (One Stop Centres – OSC) మొదలైనవారు ఉంటారు. అంతేకాకుండా, మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన హక్కులు, రక్షణ ఆదేశాలు, ఆర్థిక సహాయం వంటి వివరాలను కూడా ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారంతో అందిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




