Sharad Pawar :ఎన్‌సిపి చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో ఆయనను చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి.. పిత్తాశయంలో సమస్య ఉత్పన్నమైనట్లుగా తేల్చారు. అయనకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. వైద్యుల సూచనల మేరకు శరద్ పవార్ ఈనెల 31వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శరద్ పవార్ అరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆయన ఉదరసంబంధమైన సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. తమ నేత ఆరోగ్యం మెరుగయ్యే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నవాబ్ మాలిక్ ప్రకటించారు.
Nawab Malik Tweet:
He is on Blood Thinning Medication which is now being stopped due to this issue.
He will be admitted in hospital on the 31st of March 2021 and an Endoscopy and Surgery will be conducted.
Hence all his programmes stand cancelled until further notice.@PTI_News @ANI— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021
ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శరద్ పవార్ భేటీ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అటు హోమంత్రి అమిత్ షా, ఎన్సీపీ నేతలు స్పందించారు. అలాంటి సమావేశమేమీ జరుగలేదని తేల్చి చెప్పారు. కాగా, అమిత్ షాతో భేటీ అయ్యారంటూ వార్తలు గుప్పుమన్న గంటల వ్యవధిలోనే శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాస్తవానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. ఏప్రిల్ 1న పశ్చిమబెంగాల్‌లో మూడు రోజుల పాటు పవార్ రాజకీయ పర్యటను పెట్టుకున్నారు. ఆ మూడు రోజుల షెడ్యూల్‌లో పవార్ వివిధ ర్యాలీలు, సమావేశాలు, సభలలో పాల్గొనాల్సి ఉంది. అయితే, తాజాగా పరిణామాల నేపథ్యంలో ఆయన షెడ్యూల్ అంతా క్యాన్సిల్ అయినట్లైంది.
Also read: