Sharad Pawar: రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్.. ఎందుకంటే ?

నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ త‌న ప‌ద‌వికి రాజీనామా ఇటీవల చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాజీనామాను ఆ పార్టీకి చెందిన నేత‌లు ఏక‌గ్రీవంగా వ్యతిరేకించారు. శ‌ర‌ద్ ప‌వారే త‌మ పార్టీ చీఫ్‌గా కొన‌సాగాల‌ని ఎన్సీపీ ప్యానెల్ కూడా డిమాండ్ చేసింది. అయితే తాజాగా శరద్ పవార్ యూటర్న్ తీసుకున్నారు. తన అధ్యక్షపదవికి రాజీమామాను ఉపసంహరించుకున్నారు.

Sharad Pawar: రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్.. ఎందుకంటే ?
Sharad Pawar

Updated on: May 05, 2023 | 7:42 PM

నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ త‌న ప‌ద‌వికి రాజీనామా ఇటీవల చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాజీనామాను ఆ పార్టీకి చెందిన నేత‌లు ఏక‌గ్రీవంగా వ్యతిరేకించారు. శ‌ర‌ద్ ప‌వారే త‌మ పార్టీ చీఫ్‌గా కొన‌సాగాల‌ని ఎన్సీపీ ప్యానెల్ కూడా డిమాండ్ చేసింది. అయితే తాజాగా శరద్ పవార్ యూటర్న్ తీసుకున్నారు. తన అధ్యక్షపదవికి రాజీమామాను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్‌సీపీలో మూడు రోజుల రాజకీయ నాటకానికి తెరపడింది. తన పార్టీ నేతలే కాకుండా ఇతర పార్టీ నాయకులు, సహచరులు తాను తీసుకున్న రాజీనామ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారని.. అందుకే ఈ రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు శరద్ పవార్ స్పష్టం చేశారు.

అధ్యక్ష పదవిలో తాను కొనసాగుతున్నప్పటికీ.. పార్టీలో ఏ పదవికైనా, బాధ్యతకైనా ఓ వ్యూహాత్మకమైన ప్రణాళిక ఉండాలన్నదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీలో మార్పులు చేసే విషయంపై దృష్టి పెడతానని తెలిపారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తానని.. కొత్త నాయకత్వాన్ని కూడా ఏర్పాటుచేస్తానని వివరించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే తమ ఆలోచన విధానాల్ని, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..