2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలు ఐకమత్యంగా పోటీ చేయాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పిలుపునిచ్చారు. ఏక్తా శక్తి పార్టీ బుధవారం ఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో విలీనమైంది. ఢిల్లీలో ఏక్తా శక్తి పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర మరాఠాకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కామన్ మినిమమ్ పోగ్రామ్‌తో విపక్షాలు పోటీ చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి నుంచి బీహార్ సీఎం నితీష్‌కుమార్ బయటకు రావడం శుభపరిణామని వ్యాఖ్యానించారు శరద్‌పవార్. దేశంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశానికి ప్రతిపక్షాల ఐక్యత అవసరమని ఎన్సీపీ అధినేత అన్నారు. అన్ని పార్టీలు ఒకవైపు రావాలని పిలుపునిచ్చారు.
శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే వైపుకు వచ్చి సాధారణ ఉమ్మడి ఎజెండాతో ఎన్నికల్లో పోరాడాలని అన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ప్రశంసించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. దానిని స్వాగతిస్తున్నామని శరద్ పవార్ అన్నారు.
రైతులపైనే దృష్టి ఉంది, ఎన్నికలపై కాదు..
రైతుల అభివృద్ధిపై తాము స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా వెల్లడించారు. రైతుల అభివృద్ధి, వారి మేలు జరిగే కార్యక్రమాలపై తమ పార్టీ దృష్టి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా, పంజాబ్‌లను విస్మరించలేమన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ డబ్బు, సీబీఐ, ఈడీ దుర్వినియోగం చేస్తోందన్నారు. జార్ఖండ్‌లో కూడా అదే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
NCP chief Sharad Pawar advocates unity of Opposition parties for the 2024 elections; says, “can consider contesting elections together under the Common Minimum Program.” pic.twitter.com/a4jUMrlcv9
— ANI (@ANI) August 31, 2022
శరద్ పవార్ మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
ఈ సందర్బంగా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు శరద్ పవార్. చిన్న పార్టీలను అధికారం నుంచి తరిమికొట్టడమే బిజెపి ఉద్దేశ్యమన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని పవార్ మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం