కొన్నిరోజుల క్రితం 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 10వ తరగతి సిలబస్‌లో మరికొన్ని పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. సైన్స్ సిలబస్ నుంచి పిరియాడిక్ టేబుల్, ఇంధన మూలకాలు, సహజ వనరుల నిర్వహణ, డెమోక్రటిక్ పాలిటిక్స్-1 నుంచి ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు పాఠాలు తొలగించిన వాటిలో ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి ఎన్‌సీఈఆర్‌టీ 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పాఠాలను చదవాల్సిన అవసరదని.. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా వచ్చిన సమయంలో విద్యార్థులపై భారం పడకుండా కొన్ని పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ తాత్కాలికంగా తొలగించింది. అయితే తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో వాటిని శాశ్వతంగా తొలగించేసింది. ఇండియాలో 10వ తరగతి వరకు సైన్స్‌నుల తప్పనిసరి పాఠ్యంశంగా బోధిస్తారు. ఆ తర్వాత సైన్స్ గ్రూప్ చదివే విద్యార్థులకు మాత్రమే తొలగించిన పాఠ్యాంశాల గురించి తెలుసుకోగలుగుతారు. మరోవైపు ఎంతో ముఖ్యమైన పిరియాడిక్ టేబుల్ వంటి పాఠ్యాంశాలను 10వ తరగతి సైన్స్ పుస్తకాల తొలగించడంపై విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ఇది ఈ విద్యాసంవత్సరం సిలబస్ మార్పు చేయలేదని.. గత ఏడాది జూన్ లోనే సిలబస్ హేతుబద్దీకరణ జరిగినట్లు పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం