కాంగ్రెస్ సత్యాగ్రహ్ మార్చ్.. ఎక్కడికక్కడే అరెస్టులు.. ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు రాహుల్‌గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. AICC ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్‌గాంధీ. ప్రియాంకతో పాటు భారీగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు మద్దతుగా సత్యాగ్రహ్ మార్చ్ చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలంటూ సోనియా, రాహుల్‌కు(Rahul Gandhi ) సమన్లు జారీ చేసింది ఈడీ. ఈడీ సమన్లపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. మరికాసేపట్లో రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే అంతకు ముందు రాహుల్ గాంధీ ఇంటి బయట భారీగా పోలీసులను మోహరించడంతో ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను పెంచారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. కాంగ్రెస్ నేతల ర్యాలీకి అనుమతి నిరాకరించిన దిల్లీ పోలీసులు.. ఆ పార్టీ కార్యాలయాన్ని బారిగేట్లతో దిగ్బంధించారు. ఢిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటికే మరోవైపు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, సీడబ్ల్యుసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహ్ మార్చ్ చేపట్టింది. రాహుల్‌గాంధీ నేతృత్వంలో AICC ఆఫీస్ నుంచి ఈడీ కార్యాలయం వరకు గాంధేయమార్గంలో పాదయాత్ర చేపడుతోంది. ఐతే కాంగ్రెస్ నిరసన ర్యాలీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు..భారీగా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు.
రాహుల్‌గాంధీ నేతృత్వంలో సత్యాగ్రహ్ మార్చ్ కొనసాగుతుందంటున్నారు కాంగ్రెస్ నేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారు కూడా కాంగ్రెస్ గొంతును అణిచివేయలేకపోయారన్నారు. రాహుల్‌ను చూసి మోదీ సర్కార్ షేకైపోతోందంటూ కామెంట్ చేశారు.