National Anthem: ఆ రాష్ట్రంలోని పాఠశాల్లో జాతీయగీతం ఆలపించడం తప్పని సరి.. లేదంటే చర్యలు తప్పవన్న విద్యాశాఖ

|

Aug 19, 2022 | 9:04 AM

బెంగుళూరులోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉదయం అసెంబ్లీ సమయంలో జాతీయ గీతం ఆలపించే ప్రామాణిక ప్రోటోకాల్‌ను పాటించడం లేదని విద్యాశాఖ మంత్రి బిసి నగేష్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ శాఖ అధికారి తెలిపారు

National Anthem: ఆ రాష్ట్రంలోని పాఠశాల్లో జాతీయగీతం ఆలపించడం తప్పని సరి.. లేదంటే చర్యలు తప్పవన్న విద్యాశాఖ
National Anthem In Karnatak
Follow us on

National Anthem: కర్నాటక రాజధాని బెంగళూరులోని కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహణ సమయంలో జాతీయ గీతం ఆలపించడం మానేసిన నేపథ్యంలో ఆ స్కూల్స్ పై కేసులు నమోదయ్యాయి. జాతీయ గీతం ఆలపించడం లేదంటూ తరచూ ఫిర్యాదులు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా కర్నాటక ప్రభుత్వం చర్యలు చీపుట్టింది. ఇక నుంచి ప్రతి  స్కూల్ లో తప్పనిసరిగా జాతీయ గీతం ఆలపించాలని  కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేశారు. దీంతో ఇప్పుడు అన్ని పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో జాతీయ గీతం పాడవలసి ఉంటుంది.

బెంగుళూరులోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉదయం అసెంబ్లీ సమయంలో జాతీయ గీతం ఆలపించే ప్రామాణిక ప్రోటోకాల్‌ను పాటించడం లేదని విద్యాశాఖ మంత్రి బిసి నగేష్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ శాఖ అధికారి తెలిపారు. కొన్ని పాఠశాలలు జాతీయ గీతాన్ని ఆలపించడం మానేస్తున్నాయని, మరికొన్ని వారానికి రెండుసార్లు మాత్రమే ఆలపిస్తున్నాయని అధికారి తెలిపారు. జాతీయ గీతంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఉటంకిస్తూ.. జాతీయగీతంపై, దేశంపై గౌరవం ఏర్పడేలా పాఠశాలల్లో విద్యార్థులు జాతీయ గీతం పాడడాన్ని విద్యాశాఖ డిపార్ట్‌మెంట్ తప్పనిసరి చేసింది.

నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు:
నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలను సందర్శించే బాధ్యతను డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) అధికారులకు అప్పగించారు. స్కూల్స్ లో ఖాళీ స్థలం లేకపొతే… స్టూడెంట్స్ తమ తమ తరగతి గదుల్లోనే అసెంబ్లీని నిర్వహించాలని.. అక్కడ జాతీయ గీతం పాడవచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెంగళూరు నార్త్ డీడీపీఐ లోహితస్వా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత వారం విద్యార్థులు జాతీయ గీతం ఆలపించని పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. దీంతో ఆ పాఠశాలల యాజమాన్యం ఇక నుంచి క్రమం తప్పకుండా జాతీయ గీతం ఆలపిస్తామని  హామీ ఇచ్చాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే కర్ణాటకలో జాతీయ గీతం, దేశభక్తిపై వివాదం నడుస్తోంది. ఇటీవల సావర్కర్ చిత్రంపై వివాదం చెలరేగింది. కర్ణాటకలోని తుమకూరులో సావర్కర్ పోస్టర్ చింపేశారు. ఈ ఘటనకు ముందే సావర్కర్ చిత్రం శివమొగ్గలో వివాదానికి కారణమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..