Narayan Rane Arrest: ముఖ్యమంత్రిపై సీరియస్ కామెంట్స్.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్..

|

Aug 24, 2021 | 4:35 PM

Narayan Rane Arrest: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సంగమేశ్వర్‌లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Narayan Rane Arrest: ముఖ్యమంత్రిపై సీరియస్ కామెంట్స్.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్..
Narayan Rane
Follow us on

Narayan Rane Arrest: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సంగమేశ్వర్‌లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని చెంపదెబ్బ కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పుణే, నాసిక్, థానె, మహద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నారాయణ్ రాణేను అరెస్ట్ చేసేందుకు నాసిక్ పోలీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు పోలీసులు కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారు. కాగా, నారాయణ్ రాణ్ లీగల్ టీమ్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆయనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. జన్ ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన పొరపాటును ఉటంకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు.. జెండా ఆవిష్కరణ సమయంలో తాను ఉండుంటే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెంప పగులగొట్టే వాడిని.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు.. మహారాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ఆయన దిష్టబొమ్మలు దగ్ధం చేశారు. నారాయణ్ రాణేను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో శివసేన శ్రేణులు ఘర్షణకు పాల్పడ్డారు. రాణే చేసిన వాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అంతటా నిరసనలు వ్యక్తం చేశారు. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని ప్రకటించారు. అయితే, భారత్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియక పోవడం అనేక సహజంగానే ఎవరికైనా కోపం తెప్పిస్తుందంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.

మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ.. నారాయణ్ రాణేను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శివసేన ఎంపీ వినాయకర్ రౌత్ మంగళవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాగా, నారాయణ్ రాణేను అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తలపై ఇంతకు ముందు ఆయన స్పందించారు. ‘తానేమీ సామాన్యుడిని కాదు. నేను ఏ నేరం చేయలేదు. ఆగస్టు 15 గురించి ఒక ముఖ్యమంత్రికే తెలియకపోవడం అది నేరం కాదా? నేను అన్న మాటలు నేరం కాదు.’’ అని తనను తాను సమర్థించుకున్నారు. అయితే, ఆయన తన వ్యాఖ్యలను ఎంత సమర్థించుకున్నప్పటికీ.. మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఆయన్ను అరెస్ట్ చేశారు.

Video:

Also read:

Ukraine Plane Hijacking: విమానం హైజాకింగ్ ఘటన..తోసిపుచ్చిన ఉక్రెయిన్, ఇరాన్ .. జరిగిందేమిటి ..?

Schools Reopen: సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు బంద్‌.. విద్యా సంస్థల పునఃప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే.

Narayan Rane Arrest: ముఖ్యమంత్రిపై సీరియస్ కామెంట్స్.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్..