
ట్రిపులార్ చిత్రం అంతర్జాతీయంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిందీ మూవీ. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఆస్కార్ అందుకున్న చిత్రంగా ట్రిపులార్ నిలిచింది. ఇందులోని నాటు నాటు పాటకు ప్రపంచమే ఫిదా అయ్యింది. చంద్రబోస్ రాసి, కీరవాణి సంగీతం అందించిన నాటు నాటు సాంగ్ యావత్ లోకం జైజైలు కొట్టింది. ఎక్కడ విన్నా ఇదే పాట మోరుమోగింది.
ఇదిలా ఉంటే ఈ పాట ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారింది. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నాటు-నటాటు బాణీలో రూపొందించిన పాట వైరల్ అవుతోంది. యువకులు డ్యాన్స్ చేస్తున్న పాట ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కర్ణాటకకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన, ప్రాజెక్టులు, పథకాల పేర్లను పాటలో ప్రస్తావించారు. శివమొగ్గ ఎయిర్ పోర్ట్ , బెంగళూరు మైసూర్ ఎక్స్ ప్రెస్ వే, మెట్రో లైన్‌లను వివరిస్తూ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలోను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉంటే వచ్చే జూల నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 142 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది. ఈసారి ఎన్నికలు ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీకి మధ్యే ఉండనుంది. ఈ రెండు పార్టీలతో పాటు ఆప్ , ఎంఐఎం, జేడీఎస్ కూడా బరిలో నిలవనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..