PM Modi: ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను’.. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం.. హాజరైన అతిరథ మహారథులు..
PM Modi Swearing-in Ceremony 2024: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రా.7.15కి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు.
PM Modi Swearing-in Ceremony 2024: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రా.7.15కి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ ప్రధానులు, అధ్యక్షులు సైతం హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు , సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ హాజరయ్యారు. అలాగే మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేలు కూడా మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
వీడియో చూడండి..
వేర్వేరు దేశాల ప్రధానులు, అధ్యక్షులు మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవ్వడంతో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. అలాగే ఎన్‌ఎస్‌జి కమాండోలు, డ్రోన్‌లు, స్నిపర్‌లు కూడా మెగా ఈవెంట్‌కి సెక్యూరిటీగా ఉన్నాయి. కర్తవ్య పథ్ పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలతో వేర్వేరు ప్రాంతాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ దేశాధినేతకు సంబంధించిన ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రముఖులు బస చేసే హోటళ్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.