
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతోంది. ఇప్పటికే దీని బారిన పడి దాదాపు 30 లక్షల మంది ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో రెండు లక్షల వరకు ప్రాణాలు విడిచారు. ఈ వైరస్.. అందర్నీ అటాక్ చేస్తోంది. దీనికి కులం, మతం, భాష, ప్రాంతం లాంటివి ఏమీ లేవు. అందర్నీ ఈక్వల్‌గా చూస్తోంది. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి
విజృంభిస్తోంది. ఇప్పటికే 26వేల మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశ ప్రజలకు అసోంలో పందుల మరణం కలవరపెడుతోంది.
తాజాగా.. అసోంలో గత కొద్ది రోజులుగా వరుసగా పందులు మరణిస్తున్నాయి. ఇప్పటికే ఆరు జిల్లాల్లో దాదాపు రెండు వేల పందుల వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇవి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత స్వైన్ ఫ్లూ లేదా స్వైన్ ఫీవర్ అని అనుకున్నా.. వాటి మరణం స్వైన్ ద్వారా జరగలేదని తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పందులు మరణించిన ప్రాంతాన్ని కూడా కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించి పందుల మరణానికి కారణమైన వైరస్‌ను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ఇప్పటికే అసోం ప్రభుత్వం పంది మాంసం విక్రయాలపై నిషేధించిన క్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం.. స్థానికులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా రెస్పాండ్ అయ్యారు. పందుల మరణాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అక్కడి జిల్లా అధికారులను ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించమని చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు ఘటనాస్థలానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా పంపిచామన్నారు. నార్త్ ఇస్టర్న్ రీజినల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబరేటరీ (NERDDL) బృందాలు మరణించిన పందుల నుంచి శాంపిల్స్ సేకరించాలని ఆదేశించామన్నారు. వీటి మృతికి గల కారణాలపై విచారణ జరిపిస్తున్నామని.. విదేశీ వైరస్ ఎదైనా అటాక్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కాగా.. ఇప్పటికే మృతిచెందిన పందుల మృతదేహాల నుంచి నమూనాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పశువుల వ్యాధుల పరిశీలన విభాగానికి పంపిచామని.. రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని అధికారులు తెలిపారు.