AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: నా ఆందోళన అంతా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న ఆ రైతుల గురించే.. హర్యానా మంత్రి అనిల్ విజ్ కీలక వ్యాఖ్యలు..

Coronavirus: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులను ఎలా రక్షించాలనే దానిపైనే..

Coronavirus: నా ఆందోళన అంతా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న ఆ రైతుల గురించే.. హర్యానా మంత్రి అనిల్ విజ్ కీలక వ్యాఖ్యలు..
Minister
Shiva Prajapati
|

Updated on: Apr 09, 2021 | 4:03 PM

Share

Coronavirus: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులను ఎలా రక్షించాలనే దానిపైనే ఆందోళనగా ఉందని హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ వారి ఆందోళనలను ఎలా విరమింపజేయాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం కరోనా వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షకు మంత్రి అనిల్ విజ్ కూడా హాజరయ్యారు. ఈ సమీక్ష నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, హర్యానా సరిహద్దుల వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను కరోనా నుంచి రక్షించడంపైనే తమకు ఆందోళనగా ఉందన్నారు. రైతులెవరూ కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

ఇందులో భాగంగా.. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు పునఃప్రారంభం అయ్యేందుకు త్వరలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాస్తానని మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ చర్చల కారణంగా.. రైతులు సరిహద్దుల నుంచి వెనక్కి తగ్గుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ కరోనా సంక్షోభం ముంచుకొస్తుందని, ఈ నేపథ్యంలో రైతులు తమ ఆందోళనలపై పునరాలోచన చేస్తే బాగుంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. కరోనా టెస్ట్‌లను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరిందన్నారు. ఇక దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో రోజూవారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Also read:

IPL 2021: ఐపిఎల్ 2021 చూసేముందు ఈ వార్తను చదవండి.. సిక్సులు, ఫోర్లు, సెంచరీలు ఇవన్నీ మీకోసం.. ఇప్పుడు సరదా మరోలా ఉంటుంది..

SC ST Case : చంద్రబాబు, లోకేష్ మీద పోలీస్ కంప్లైంట్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు