హిందూ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకొని.. ముస్లిం భయ్యా నీకు హాట్సాఫ్

| Edited By:

Aug 24, 2020 | 10:10 AM

ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల సారంశం ఒకటే. అదేంటంటే మనుషులంతా ఒకటే అని. కానీ మనమే దాన్ని మరిచి ఇతర మతాల వారిని వేరుగా చూస్తుంటాం.

హిందూ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకొని.. ముస్లిం భయ్యా నీకు హాట్సాఫ్
Follow us on

Muslim man adopted Hindu sister: ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల సారంశం ఒకటే. అదేంటంటే మనుషులంతా ఒకటే అని. కానీ మనమే దాన్ని మరిచి ఇతర మతాల వారిని వేరుగా చూస్తుంటాం. మతాల పేరుతో కొట్టుకుంటుంటాం. ఇదిలా ఉంటే అందరికీ స్ఫూర్తిని కలిగించేలా ఇప్పుడు ఓ ముస్లిం వ్యక్తి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూ అక్కా చెల్లెళ్లను దత్తత తీసుకొని, వారికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి మరీ అత్తారింటికి పంపారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

అహ్మద్‌నగర్‌కి చెందిన బాబాభాయ్ పఠాన్ అనే ముస్లిం వ్యక్తి అనాథలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొన్నేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఇటీవల తన సొంత డబ్బులతో హిందూ సంప్రదాయం ప్రకారం వారిని పెళ్లి చేశారు. ఇక వారిని అత్తారింటికి పంపుతూ పఠాన్, భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబసభ్యులు సైతం ఆ ఇద్దరు అత్తారింటికి వెళుతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు పఠాన్ భాయ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సార్ మీరే నిజమైన భారతీయులు, మీరొక హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

V movie: ‘వి’కి సెన్సార్ పూర్తి!

వాలంటీర్‌ని పెట్టి‌ విజయం సాధిస్తాం: రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సవాల్‌

 

https://twitter.com/aarifshaah/status/1297451867824218114?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1297451867824218114%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.scoopwhoop.com%2Fnews%2Fmeet-bababhai-pathan-a-muslim-man-who-adopted-two-sisters-got-them-married-in-a-hindu-ceremony%2F