V movie: ‘వి’కి సెన్సార్ పూర్తి!

నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వి' డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలో డైరెక్ట్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

V movie: 'వి'కి సెన్సార్ పూర్తి!
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 8:41 AM

V Censor completed: నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలో డైరెక్ట్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఈ చిత్రం విడుదల అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సెన్సార్‌ని పూర్తి అయ్యిందట. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘వి’కి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారట.  ఈ క్రమంలో త్వరలోనే ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ‘వి’లో అతడు కిల్లర్‌గా కనిపించనున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. నివేథా థామస్‌, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. మార్చిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఇక పరిస్థితులు ఇప్పట్లో సర్దుకునేలా లేకపోవడంతో.. ‘వి’ని ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే తన భార్య(అదితీ రావు హైదరీ)ను దారుణంగా హతమార్చిన వారిని చంపుతూ, అక్కడ వి అనే మార్కును నాని వదిలి వెళుతుంటాడట. ఈ కేసును చేధించే బాధ్యతలు సుధీర్ బాబు తీసుకొని, చివరకు నానిని పట్టుకుంటారని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More:

వాలంటీర్‌ని పెట్టి‌ విజయం సాధిస్తాం: రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సవాల్‌

పొగరాయుళ్లకు చెక్ పెట్టిన కరోనా