Ganesh Chaturthi: వినాయక ఉత్సవాల్లో అరుదైన దృశ్యం.. ముస్లిం ఇంట కొలువు దీరిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..

|

Sep 03, 2022 | 12:17 PM

దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్‌ చతుర్థి మొదలు ఏడు రోజుల పాటు గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు.

Ganesh Chaturthi: వినాయక ఉత్సవాల్లో అరుదైన దృశ్యం.. ముస్లిం ఇంట కొలువు దీరిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
Muslim Family
Follow us on

Ganesh Chaturthi:  దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణనాథుల సందడి నెలకొంది. అదిరిపోయే సెట్టింగ్‌లు, రంగురంగుల 0విద్యుత్‌ కాంతులతో మండపాలు జిగేల్‌మంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు అక్కడి ప్రజలు. మతసామరస్యాన్ని చాటుతూ అలీఘర్‌లోని ఒక ముస్లిం మహిళ గణపతి ఉత్సవాలు నిర్వహిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఆమె వారింట్లో గణపతిని ఏర్పాటు చేసుకున్నారు. గణేష్‌ చతుర్థి మొదలు ఏడు రోజుల పాటు గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అలీఘర్‌లోని రోరావర్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడీఏ కాలనీకి చెందిన రూబీ ఆసిఫ్ ఖాన్ తన ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని సకల పూజలతో హారతి, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు ఆసిఫ్‌ ఖాన్‌ మాట్లాడుతూ…

“మేము విగ్రహాన్ని సెప్టెంబర్ 6 న నిమజ్జనం చేయనున్నట్టుగా తెలిపారు. అంతకు ముందు ఏడు రోజుల పాటు ఇంట్లోనే గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఇంటిల్లిపాది ప్రతిరోజూ ఆచారాల ప్రకారం పూజ చేస్తామని, స్వామికి ‘మోదకాలు’ సమర్పిస్తామని” ఆమె చెప్పింది. గణేష్‌పై తనకు అపారమైన నమ్మకం ఉందని, స్వామిని ఇంటికి తీసుకురావడానికి తన కుటుంబం అభ్యంతరం చెప్పలేదని రూబీ తెలిపింది.

మతాలకు అతీతంగా తాను, తన కుటుంబంతో కలిసి అన్ని పండుగలు జరుపుకుంటామని చెప్పింది. ఆమె భర్త ఆసిఫ్ ఖాన్ తన భార్య నమ్మకానికి మద్దతు ఇచ్చాడని, కుటుంబం మొత్తం వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. సోషల్ మీడియాలో వార్త చూసిన నెటిజన్లు ఆ ముస్లిం భక్తులను ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి