రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్‌ తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు! భారత క్రికెటర్‌పై నెటిజన్లు ఫైర్‌

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రశాంత వాతావరణంలో చాయ్ తాగుతున్న ఫోటోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు, బీజేపీ నేతలు ఆయన పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్‌ తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు! భారత క్రికెటర్‌పై నెటిజన్లు ఫైర్‌
Yusuf Pathan

Updated on: Apr 13, 2025 | 3:36 PM

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక వైపు రాష్ట్రం తగలబడుతుంటే.. ఈయన చాయ్‌ తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అందుకు కారణం ఏంటంటే.. యూసుఫ్‌ పఠాన్‌ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కావడమే.

యూసుఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో అతను టీ తాగుతూ ఒక ఎస్టేట్‌లో రిలాక్స్‌ అవుతున్నట్లు కనిపించారు. పఠాన్ ఈ పోస్ట్‌కు “మధ్యాహ్న సమయం మంచి చాయ్, ప్రశాంతమైన పరిసరాలు. ఈ క్షణంలో మునిగిపోయాను” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది ఇంటర్నెట్‌లోని కొంతమందికి నచ్చలేదు. ఒక యూజర్ “వాహా ముర్షిదాబాద్ జల్ రహా హై ఔర్ ఆప్ ఘుమ్ రహే హో? (ముర్షిదాబాద్ మండుతోంది.. మీరు పర్యటిస్తున్నారు)” అనే పోస్ట్ కింద వ్యాఖ్యానించారు.

మరొకరు “మీ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో మీకు తెలుసా???” అని ప్రశ్నించారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎంపీ యూసుఫ్ పఠాన్ పోస్ట్ పై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా విమర్శలు చేశారు. “బెంగాల్ మండుతోంది. హైకోర్టు కళ్ళు మూసుకుని ఉండలేమని చెప్పి కేంద్ర బలగాలను మోహరించింది. పోలీసులు మౌనంగా ఉండగా మమతా బెనర్జీ రాష్ట్ర రక్షిత హింసను ప్రోత్సహిస్తున్నారు! ఇంతలో యూసుఫ్ పఠాన్ – ఎంపీ టీ తాగుతూ హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు… ఇది TMC’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ విమర్శలపై యూసుఫ్ పఠాన్ స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.