తౌప్తే తుపాను ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను వణికిస్తోంది. ముంబై నగరానికి వస్తే భారీ వర్షానికి ఇది తడిసి ముద్దయింది. భారీ గాలులకు పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరుగుతున్నాయి. నిన్న నగరంలోని ఓ ప్రాంతంలో గొడుగు పట్టుకుని ఓ మహిళ ముందుకు రాబోగా హఠాత్తుగా ఓ భారీ వృక్షం కింద పడింది. అయితే అప్రమత్తంగా ఉన్న ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వృక్షం నేలకు ఒరుగుతుండగానే వెనక్కు పరుగులు తీసింది. ఆమె ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆమెపై పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫాను దాటికి మహారాష్ట్రలో ఆరుగురు, గుజరాత్ లో ముగ్గురు మరణించారు. దేశవ్యాప్తంగా 19 మంది మృతి చెందినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంగళవారం ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 16 న 115 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు విమానాశ్రయాన్ని, బాంద్రా-వొర్లీ సీ లింక్ ను కొన్ని గంటలపాటు మూసివేశారు. దీనివల్ల అత్యవసర పనులమీద వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది.
ఇక గుజరాత్ లో 2,500 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 160 రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, సుమారు 50 వేలఇళ్ళు దెబ్బ తిన్నాయని అధికారులు చెప్పారు. కాగా సైక్లోన్ ముప్పు ఇంకా తొలగి[పోలేదని వారు హెచ్ఛరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.
#WATCH | Mumbai: A woman had a narrow escape when she managed to move away from the spot just in time as a tree uprooted and fell there. (17.05.2021)
Mumbai received heavy rain and wind yesterday in wake of #CycloneTauktae
(Source: CCTV footage) pic.twitter.com/hsYidntG7F
— ANI (@ANI) May 18, 2021
మరిన్ని చదవండి ఇక్కడ: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..