Chinese Manja: బీ అలర్ట్.. కానిస్టేబుల్ ప్రాణం తీసిన చైనా మాంజా.. డ్యూటీ ముగించుకోని ఇంటికి వెళ్తుండగా..

|

Dec 25, 2023 | 1:57 PM

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. దీనితో పాటే న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్దం అవుతున్నారు. దానికి తోడు మార్కెట్లో రంగురంగుల పతంగులు ఆకర్షిస్తున్నాయి. ఈ పతంగులే ప్రాణాలు తీస్తున్నాయి. పూర్తి డీటేల్స్‌లోకి వెళ్తే.. ముంబైలో పతంగి మాంజా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌కు చైనీస్ మాంజా తగిలి గొంతు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Chinese Manja: బీ అలర్ట్.. కానిస్టేబుల్ ప్రాణం తీసిన చైనా మాంజా.. డ్యూటీ ముగించుకోని ఇంటికి వెళ్తుండగా..
Crime News
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. దీనితో పాటే న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్దం అవుతున్నారు. దానికి తోడు మార్కెట్లో రంగురంగుల పతంగులు ఆకర్షిస్తున్నాయి. ఈ పతంగులే ప్రాణాలు తీస్తున్నాయి. పూర్తి డీటేల్స్‌లోకి వెళ్తే.. ముంబైలో పతంగి మాంజా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌కు చైనీస్ మాంజా తగిలి గొంతు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. దిండోశి పోలీసు స్టేషన్‌కు చెందిన సురేష్‌ జాదవ్‌ (37) డ్యూటీ ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం వేళ వర్లీలోని తన ఇంటికి వెళ్తున్నాడు. మోటార్‌ సైకిల్‌పై వాకోలా బ్రిడ్జి మీదుగా పోతుండగా పతంగి మాంజా అతని గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో తీవ్ర గాయాలతో కింద పడ్డాడు. కానిస్టేబుల్ ను గమనించిన కొందరు అతన్ని హాస్పటల్‌ తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదం జరిగిన సమయంలో పోలీసు సమీర్ సురేష్ జాదవ్ వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని వకోలా వంతెనపై ఉన్నారని ముంబై పోలీసు అధికారి చెప్పారు. “జాదవ్‌ గోరేగావ్‌లోని దిండోషి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారని.. మోటార్‌సైకిల్‌పై వర్లీలోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా.. గాలిపటం తీగ తగిలి గొంతు కోసుకుపోయిందని.. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు’’ అని తెలిపారు. ఖేర్వాడి పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారన్నారు.

అయితే, ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చైనీస్ మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ.. దేశంలోని చాలా ప్రాంతంలో వీటిని విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా కొందరు యథేచ్ఛగా అమ్ముతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే పండుగల సందడి నేపథ్యంలో పబ్లిక్‌ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. సంతోషంగా జరుపుకునే పండుగలు, ఆనందాన్ని రెట్టింపు చేయాలి కానీ విషాదాన్ని నింపొద్దు. వరుస సెలవులకు తోడు సంక్రాంతి పండుగ కూడా దగ్గర పడింది. ఈ నేపథ్యంలో పతంగులను ఎగురవేసేందుకు యువకులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ విషయాలను గుర్తుంచుకోని.. ఆనందంగా పండుగలను జరుపుకోవాలని టీవీ9 విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..