Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..

|

Jan 26, 2022 | 7:35 PM

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. కాపీరైట్ ఉల్లంఘన కేసు కింద  ఆయనతోపాటు, యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సునీల్ దర్శన్ ఫిర్యాదు..

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..
Sundar Pichai
Follow us on

Google CEO Sundar Pichai: గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్‌పై(Sundar Pichai) మహారాష్ట్రలో కేసు (Mumbai Police) నమోదైంది. కాపీరైట్ ఉల్లంఘన కేసు కింద  ఆయనతోపాటు, యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సునీల్ దర్శన్(Film director Suneel Darshan) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ విషయాన్ని సునీల్ దర్శన్ మీడియాకు తెలియజేశారు. మహారాష్ట్రలోని కోర్టు సూచనల మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ‘ఏక్ హసీనా తీ ఏక్ దీవానా థా’ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి అనధికార వ్యక్తులను గూగుల్ అనుమతించిందని చిత్ర దర్శకుడు సునీల్ దర్శన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన  ఒక రోజు ముందే ఇచ్చారని మీకు తెలియజేద్దాం.

చిత్ర నిర్మాత సునీల్ దర్శన్ కాపీరైట్ కేసులో కోర్టును ఆశ్రయించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంఐడీసీ పోలీసులు అంధేరీ ఈస్ట్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్లు 51, 63, 69 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సునీల్ దర్శన్ బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు. 2017లో తన చివరి సినిమా ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా ఐ. తనకు తెలియకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని దర్శన్ ఆరోపించారు

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మ అవార్డుల్లో 128 మందికి చోటు దక్కింది. అందులో నలుగురికి పద్మవిభూషణ్ లభించింది. వీరిలో ముగ్గురికి మరణానంతరం లభించింది. 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు.

ఇవి కూడా చదవండి: Long Hair Tips: పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే కురులు కావాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి..

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..