ముంబైలో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అంథేరికి చెందిన ఓ హోటల్ రూమ్‌లో 30 ఏళ్ల మోడల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డోర్‌ను తెరిచి చూడగా శవంగా కనిపించింది. మోడల్ ను ఆకాంక్ష మోహన్‌గా గుర్తించారు. పోలీసులు ఆ రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ ఆకాంక్ష బుధవారం రాత్రి 8 గంటలకు హోటల్‌కు చెకిన్ అయ్యింది. డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. కానీ గురువారం ఉదయం ఆమె డోర్‌ను తెరవలేదు. అయితే, హౌజ్ కీపింగ్ సిబ్బంది ఎంత పిలిచినా ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో వారు హోటల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మాస్టర్ కీ ద్వారా ఆ రూమ్ తలుపును ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతూ మోడల్ ఆకాంక్ష మోహన్ శవం కనిపించింది.
మోడల్ ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుంచి ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐ యామ్ సారీ, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, నేను సంతోషంగా లేను.. నాకు ప్రశాంతత కావాలి అని సూసైడ్ నోట్‌లో ఆకాంక్ష రాసినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెర్సోవా పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పలు వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం