ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు పసిపిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మృతులను పారిస్ గుప్తా (7), నరేంద్ర గుప్తా (10), మంజు ప్రేమ్ గుప్తా (30), ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (30)గా గుర్తించారు. గాఢనిద్రలో ఉన్న వారంతా మంటలను గమనించలేదు. దీంతో వారంతా నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని చెంబూర్ ఈస్ట్ ఏఎన్ గైక్వాడ్ మార్గ్‌లోని సిద్ధార్థ్ కాలనీలో ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక దుకాణం ఉంది. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
#WATCH | Mumbai, Maharashtra | 7 people including 3 children died after a fire broke out at a shop in Chembur around 5 am today: BMC pic.twitter.com/Q87SN0Pgdo
— ANI (@ANI) October 6, 2024
అయితే అప్పటికే మంటలు బాధితులు నివాసముంటున్న పై అంతస్తుకు చేరుకున్నాయి. బాధితులను రాజావాడి ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రికి చేరుకునే లోపుగానే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. భవనంలో మృతుల సంఖ్యపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అందులో ఏడుగురు ఉన్నారని, మరికొందరు ఐదుగురు ఉన్నారని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..