Rimple Jain: తల్లి మృతదేహాన్ని ముక్కలు చేసిన కూతురు.. దుర్వాసన రాకుండా 40 ఎయిర్ ఫ్రెషనర్స్ కొన్న కుమార్తె

మృతదేహాన్ని పారవేసే మార్గాన్ని ఇంటర్నెట్‌లో పరిశీలించి తీసుకున్నానని పేర్కొంది. అనంతరం సమీపంలోని దుకాణం నుండి మార్బుల్ కట్టర్‌ను కొనుగోలు చేశానని రింపుల్ పోలీసుల విచారణలో తెలిపింది.

Rimple Jain: తల్లి మృతదేహాన్ని ముక్కలు చేసిన కూతురు.. దుర్వాసన రాకుండా  40 ఎయిర్ ఫ్రెషనర్స్ కొన్న కుమార్తె
Mumbai Crime News

Updated on: Mar 19, 2023 | 12:07 PM

తల్లిని చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలు చేసిన కూతురు ముంబై పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది. అసలు తన తల్లి మాట్లాడేది కాదని చెప్పింది. అది తనను కలవరపరిచింది. మరోవైపు తన తల్లి మెట్లపై నుండి పడి చనిపోవడంతో.. హత్య చేసినట్లు ఆరోపణలు వస్తాయని భయపడినట్లు పేర్కొంది. దీంతో తన తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికినట్లు పేర్కొన్నది ముంబయిలోని లాల్‌బాగ్ చాల్‌లో నివసిస్తున్నమృతురాలు వీణా ప్రకాష్‌ జైన్‌ కుమార్తె రింపుల్. మృతదేహం ముక్కలను రెండు నెలలుగా ఇంట్లో ఉంచడం వల్ల దుర్వాసన వస్తోందని పోలీసుల విచారణలో అంగీకరించింది. అటువంటి పరిస్థితిలో.. మృత దేహం నుంచి వస్తున్న దుర్వాసనను తగ్గించేందుకు టీ ఆకులు, ఫినాయిల్,  సుమారు 40 బాటిళ్ల ఎయిర్ ఫ్రెషనర్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది.

పోలీసులు రింపుల్ జైన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం ప్రస్తుతం రింపుల్ జైన్‌ సోమవారం వరకుపోలీసు కస్టడీలో ఉండాల్సి ఉంది. తన తల్లి మరణించిన తర్వాత..  మృతదేహాన్ని పారవేసే మార్గాన్ని ఇంటర్నెట్‌లో పరిశీలించి తీసుకున్నానని పేర్కొంది. అనంతరం సమీపంలోని దుకాణం నుండి మార్బుల్ కట్టర్‌ను కొనుగోలు చేశానని రింపుల్ పోలీసుల విచారణలో తెలిపింది. ఇంట్లో ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో మళ్లీ ఇంటర్నెట్‌లో స్మెల్ ను తొలగించే మార్గం కనిపెట్టి ఆన్‌లైన్‌లో టీ ఆకులు, ఫినైల్, ఎయిర్ ఫ్రెషనర్ కొనుగోలు చేసి వాడినట్లు చెప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 27న మెట్లపై నుంచి కిందపడి తన తల్లి వీణా ప్రకాష్‌ జైన్‌ కి తీవ్రగాయాలయ్యాయని రింపుల్ తన వాంగ్మూలంలో పేర్కొంది. అదే సమయంలో..  రెండు రోజుల తరువాత మరణించింది. తన తల్లి మరణానికి భయపడింది. తల్లిని చంపిన నేరం తనపైనే పడుతుందని అనుకుంది. అందుకే తన తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి పాలిథిన్‌లో చుట్టింది.

ఇవి కూడా చదవండి

మృత దేహాన్ని కోసేందుకు మార్బుల్ కట్టర్ కొన్నానని.. అయితే మృతదేహం పూర్తిగా దానితో కట్ చేయలేకపోవడంతో.. అప్పుడు కత్తిని కూడా వాడినట్లు పోలీసులకు తెలిపింది.

ఈ కేసులో ఓ వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. ఈ వ్యక్తిని లక్నో నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవసరమైన విచారణ తర్వాత విడుదల చేశారు. సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, ఈ వ్యక్తికి ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధం లేదు. అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నగరం విడిచి వెళ్లడం నిషేధించబడింది. ఈ వ్యక్తికి రింపుల్‌కి మధ్య పరిచయం ఉన్నదని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..