ప్రయాగ్‌రాజ్ కుంభమేళా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన అంబానీ కుటుంబం..
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలందరిపైనా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. కుంభమేళా సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు అనంత్ తెలిపారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం తీర్థ యాత్రి సేవ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఇందులో

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ మంగళవారం తన కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం చేశారు. తన తల్లి కోకిలాబెన్ అంబానీ, కుమారుడు ఆకాష్, కోడలు శ్లోక, కుమారుడు అనంత్, రాధికతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ ఈ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలందరిపైనా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. కుంభమేళా సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు అనంత్ తెలిపారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం తీర్థ యాత్రి సేవ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఇందులో ఉచిత భోజనం, వైద్య సహాయం, రవాణా సహాయం, భద్రతా చర్యలు మరియు మెరుగైన కనెక్టివిటీని అందించడం, యాత్రికులకు సజావుగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
మాఘి పూర్ణిమ సందర్భంగా అంబానీ హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. అక్కడ్నుంచి కారులో సంగం వరకు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాట్లను పెంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




