Mother Dairy Milk Price: దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో పాల ధరలను కూడా పెంచుతూ కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అముల్ బాటలోనే మదర్ డెయిరీ కూడా అడుగులు వేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్, తదితర నగరాల్లో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన పాల ధరలు అన్ని రకాలకూ వర్తిస్తుందని మదర్ డెయిరీ వెల్లడించింది.
గతంలో 2019 డిసెంబరులో మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. కరోనా సంక్షోభ సమయంలో పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకేజింగ్, రవాణ ఖర్చులు పెరిగాయి. దీంతో పాల ధరలు పెంచక తప్పడం లేదని మదర్ డెయిరీ ప్రకటనలో వెల్లడించింది. ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని డెయిరీ తెలిపింది.
ప్రస్తుతం రైతుల నుంచి పాల సేకరణ ధరలు 8 నుంచి 10 శాతం పెరిగినట్లు మదర్ డెయిరీ పేర్కొంది. ప్రస్తుత ధరకంటే లీటరుకు రెండు రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన పాల ధరలు సెంట్రల్ ఉత్తరప్రదేశ్, ముంబై, నాగ్పూర్, కోల్కతా తదితర నగరాల్లోనూ రేపటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా.. దేశంలోని దాదాపు వందకు పైగా నగరాల్లో మదర్ డెయిరీ పాలను, పాల పదార్థాలను విక్రయిస్తోంది.
Also Read: